Healh Tips: పరిగడుపున వెల్లుల్లి తినడం వల్ల లాభాలు తెలుసా..?

మన వంటగది ( Kitchen ) లోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ( garlic  ) కూడా ఒకటి. 

Last Updated : Aug 19, 2020, 08:10 AM IST
Healh Tips: పరిగడుపున వెల్లుల్లి తినడం వల్ల లాభాలు తెలుసా..?

Benefits of Garlic: న్యూఢిల్లీ: మన వంటగది ( Kitchen ) లోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ( Garlic  ) కూడా ఒకటి. సాధారణంగా వెల్లుల్లిని వంటలో రుచి కోసం వాడుతారు.. కానీ దానిలో అనేక ఔషధాలు పుష్కలంగా ఉన్నాయనేది కానీ.. దానివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది కానీ తెలియదు. వాస్తవంగా మీరు ఆరోగ్యవంతంగా ఉండటంలో వెల్లుల్లి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జలుబు, జ్వరం, ఫ్లూ, క్యాన్సర్ వంటి వ్యాధులను అరికడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు ( Benefits of Garlic ) కల్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు దరిచేరవు. కావున వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. Also read: Health tips: తులసి పాలు తాగితే.. ఈ రోగాలు మటుమాయం

ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే.. జీర్ణక్రియ  (Digestion) మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీంతోపాటు మన శరీర బరువు (Weight Loss) కూడా తగ్గించేందుకు దోహదపడుతుంది.  

రక్తం మందంగా ఉన్నవారికి వెల్లుల్లి తినడం వల్ల చాలా ఉపయోగాలు కలుగుతాయి. వెల్లుల్లి రక్తం గడ్డకట్టడాన్ని ( Blood Clooting ) నిరోధించి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ రెండు రెబ్బలు వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య దూరమవుతుంది.

పరిగడుపుతో.. నీరు, పచ్చి వెల్లుల్లి సేవించడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ విధంగా చేయడం వల్ల మీరు డయాబెటిస్, డిప్రెషన్ నుంచి దూరంగా ఉండవచ్చు. బాడీ డిటాక్స్ అవుతుంది. అంతేకాకుండా మీరు అనేక రకాల క్యాన్సర్ల ( Cancer ) ను కూడా నివారించవచ్చు.

వెల్లుల్లి దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. మీరు వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే, మీ రక్తపోటు (BP).. బ్లడ్ షుగర్ రెండూ అదుపులో ఉంటాయి.

ఉదయాన్ని వెల్లుల్లితోపాటు నీరు తాగటం వల్ల జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దీంతోపాటు జ్వరం, ఫ్లూ వంటివి కూడా దూరమవుతాయి.

వెల్లుల్లిలో ఔషధ లక్షణాలు పుష్కలంగా నిండిఉన్నాయి. కావున దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీకు అనేక రకాల ప్రయోజనాలు లభించడంతోపాటు ఆరోగ్యవంతంగా ఉండటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. Also read: Health Tips: ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు

Trending News