Health Benefits of Napping: మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ కాస్త బద్దకంగా ఉంటుంది. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు. నిజమే.. భోజనం తర్వాత నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం కునుకు తీస్తే రాత్రి నిద్రరాదేమోనని కొందరు భావిస్తారని, అందులో నిజం లేదని తెలుసుకోవాలి. ఆరోగ్యవంతులు గరిష్టంగా 25-30 నిమిషాలు నిద్రించవచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు ఓ గంట సమయం వరకు కనుకు తీయవచ్చు. మధ్యాహ్నం నిద్ర(Sleeping)తో ఎంతో మానసిక ప్రశాంతత లభించి తాను ఎన్నో విజయాలు సాధించానని సాకర్ స్టార్ రొనాల్డో ఎన్నో సందర్భాలలో ప్రస్తావించడం తెలిసిందే. 


Also Read: స్మోకింగ్ చేస్తున్నారా.. ఇకనుంచి వారికి నిషేధం, కొత్త రూల్స్ ఇవే!



మధ్యాహ్నం నిద్ర(NAP) వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
-  మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది


-  ఒత్తిడిని మరిచి నిద్రిస్తారు కనుక హైబీపీని సైతం నియంత్రిస్తుంది.


-  డయాబెటిస్(Diabetes), పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలకు చిన్న పరిష్కారం


-  హార్మన్ల సమతౌల్యత పెరుగుతుంది. హోర్మోన్లు చక్కగా పనిచేస్తాయి.


-  స్థూలకాయ సమస్య నుంచి బయటపడవచ్చు


-  అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఉపకరిస్తుంది. 


-  చెడు కొవ్వును కరుగుతుంది


Also Read: Health Tips: ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook