ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అనే విషయంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. అన్ని పరిశోధనలు వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి గొప్పగా చెప్పాయి. నడక వల్ల నాజూకు నముమే కాదు..నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ప్రతీ రోజు వాకింగ్ చేయం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే . నడకను మీ జీవితంలో ( LifeStyle ) భాగం చేసుకోండి.



ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే


1. రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం శారీరకంగా చురుకుగా ఉండే వారికి కోరోనరీ హార్ట్ డిజీసెస్ ముప్పు తక్కువ అని.. కార్డియో వాస్క్యూలర్ డిజీస్ వల్ల మరణం సంభవించే అవకాశం తక్కువట.


2. రోజూ వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా, కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది.  ( Regular walking lowers blood pressure ) 



3. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఫీల్ గుడ్ ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి ( Feel-good Endorphins ).ఇది ఒత్తిడిని తొలగిస్తుంది. యాంగ్జైటీని తగ్గిస్తుంది.


4. ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి...కండరాలకు బలం చేకూరుతుంది ( Strengthens your Bones and Muscles )


5. బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం. దీనికి డైటింగ్ చేసే అవసరం లేదు. కేవలం ప్రతీ రోజూ 30 నిమిషాలు నడిచి ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.