Lady Finger: మీ డైట్‌లో బెండకాయ చేరిస్తే.. ఆ వ్యాధులకు చెక్... బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్..
Health Benifits of Lady Finger: బెండకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా.. మీ డైట్‌లో బెండకాయను చేర్చుకోవడం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పలు వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు.
Health Benifits of Lady Finger: ఓక్రా, లేడీ ఫింగర్, బెండకాయ... ఇలా పేరేదైనా అందులోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కె, విటమిన్ బీ6 సమృద్దిగా లభిస్తాయి. కనీసం వారానికి ఒకసారైనా బెండకాయ తినడం వల్ల కొన్ని వ్యాధులు దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు, బెండకాయ మీ శరీర బరువును, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించగలదు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు తమ డైట్‌లో బెండకాయను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
బరువు తగ్గడంలో దోహదపడుతుంది :
రోజుకు 100 గ్రా. బెండకాయలను ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మొత్తం విటమిన్ సీలో 38 శాతం అందుతుంది. విటమిన్ సి పలు వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు మిమ్మల్ని దూరం చేస్తుంది. బెండకాయలో ఉండే ఫైబర్ బరువును నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో కేలరీలు లేకపోవడం వల్ల బరువు పెరగడమనేది జరగదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి, వేగంగా బరువు పెరిగేవారికి బెండకాయ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
డయాబెటీస్‌తో బాధపడేవారికి :
డయాబెటీస్ పేషెంట్లకు బెండకాయ ఒక వరం లాంటిది. దీన్ని మీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా చేయడంలో దోహదపడుతుంది. అయితే వైద్య సలహా మేరకే డయాబెటీస్ పేషెంట్ల బెండకాయను తమ డైట్‌లో చేర్చుకోవాలి.
క్యాన్సర్‌కు చెక్ :
ఆహారంలో బెండకాయ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా మీ దరిచేరదు. ప్రేగులలోని విషపూరిత మూలకాలను ఇది తొలగిస్తుంది. కాబట్టి మీ డైట్‌లో బెండకాయ ఉండేలా చూసుకుంటే... మీరు హెల్తీగా ఉంటారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Roasted Garlic Benefits: పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుదల కోసం కాల్చిన వెల్లుల్లితో ఇలా చేయాలి!
Also Read: Healthy Breakfast: మెరుగైన ఆరోగ్యం కోసం ఈ బ్రేక్ ఫాస్ట్ లను ట్రై చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.