Benefits Of Eating Hara Chana: శీతాకాలంలో సమృద్ధిగా లభించే వాటిలో పచ్చి శెనగ గింజలు ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాధారణంగా ఈ పచ్చి శెనగను ఉడకబెట్టుకుని లేదా వేయించుకుని తింటూ ఉంటారు. ఇందులో అద్భుత ఔషద గుణాలు ఉన్నాయి. ఈ గింజల్లో ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తో పాటు విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్సు అధిక మొత్తంలో ఉన్నాయి. పచ్చి శెనగ పప్పును తినండ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చి శెనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
డ్రిపెషన్ దూరం
పచ్చి శెనగను తీసుకుంటే విటమిన్ బి9 లేదా ఫోలేట్ వంటివి మన శరీరానికి అందుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల మీరు డ్రిపెషన్ నుండి బయటపడతారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి దూరమవుతుంది. దీంతో చాట్ తయారు చేసుకుని తినవచ్చు. అంతేకాకుండా వివిధ ఆహారాల్లో తీసుకోవచ్చు.
బరువు తగ్గించడంలో..
గ్రీన్ గ్రామ్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మీ పొట్ట నిండిపోయినట్టు ఉంటుంది. ఇది ముఖ్యంగా మీ బరువును తగ్గించడంలో అద్బుతంగా పనిచేస్తుంది.  
గుండెను పదిలంగా ఉంచడంలో..
పచ్చి శెనగలో మెగ్నీషియం, పొటాషియం వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా బీపీ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది.


జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో..
గ్రీన్ గ్రామ్ లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకోవంటే మీ కుదుళ్లు గట్టి పడటంతోపాటు జట్టు రాలకుండా ఉంటుంది.
నానబెట్టి తింటే..
నానబెట్టిన పచ్చి శెనగ తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. దీనిని రాత్రింతా నానబెట్టి తర్వాత ఉదయం తింటే మీ ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా శరీరాన్ని దృఢంగా చేయడారనికి కూడా కృషి చేస్తుంది.


Also Read: How Reduce Cholesterol: కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల పరిమాణాలు తగ్గడానికి ఈ రసాలు ప్రతి రోజూ తాగితే చాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook