How Reduce Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ విచ్చల విడిగా పెరగడం కారణంగా చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అధిక కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా మందిలో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. కొందరిలోనైతే గుండెపోటు సమస్యలు వచ్చి ప్రాణాంతకంగానూ మారుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు వాహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ నియంత్రించడానికి పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్లలు కూడా తగ్గుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రసాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
ఉసిరి రసం:
ఉసిరి గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ఉసిరి రసం ప్రతి రోజూ తాగితే సులభంగా వెన్నలా కరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తాయి.
టమాటో రసం:
టమోటా రసంలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే లిపోప్రొటీన్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఈ రసం ప్రతి రోజూ తాగితే శరీరం డిటాక్స్ అవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుమ్మడికాయ రసం:
గుమ్మడికాయ రసాన్ని చాలా మంది రిఫ్రెస్‌మెంట్ కోసం తాగుతూ ఉంటారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ప్రతి రోజూ గుమ్మడికాయ రసం తాగాల్సి ఉంటుంది. గుమ్మడిలో ఉండే పోషకాలు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా సులభంగా తగ్గుతుంది.
ఓట్స్ జ్యూస్:
ఓట్స్ జ్యూస్ కొలెస్ట్రాల్ కరిగించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే బీటా గ్లూకాన్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా సిరల నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Aso Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి
Also Read:l RGV on Pawan: గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది.. పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook