Taro Root Benefits: చేమ దుంపలు తింటే ఇన్ని వ్యాధులు దూరమవుతాయి?
Taro Root Benefits: మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా తరుచూ మనం అనారోగ్యాల బారిన పడుతున్నాం. ప్రస్తుత రోజుల్లో ఆయిల్ పుడ్, ఫాస్ట్ పుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబకాయం, గుండె జబ్బుల వంటి రోగాలు వస్తున్నాయి. ఇలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే...ఈ కూరగాయను మీ ఆహారంలో చేర్చుకోండి.
Taro Root Benefits: చేమ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిని తినడం అంటే అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి. ఈ దుంపలలో ఫైబర్ మరియు రెసిస్టెంట్ స్టార్చ్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో ఏ వ్యాధులు అంత తొందరగా దరిచేరవు. గుండె ఆరోగ్యంగా ఉండటంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీని తినడం (Taro Root Benefits) వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
చేమ దుంపలు ప్రయోజనాలు
1. గుండె జబ్బులు మరియు క్యాన్సర్ కు చెక్
చేమ దుంపలను ఇంగ్లీషులో అర్బీ లేదా టారో రూట్ అంటారు. ఈ దుంప పోషకాల గని. ఇందులో ఉండే పాలీపైనాల్స్ అని పిలువబడే మెుక్కల ఆధారిత సమ్మేళనాలు క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. అంతేకాకుండా దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులను కూడా అరికట్టవచ్చు.
2. బ్లడ్ షుగర్ అదుపులో..
టారో రూట్లో స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో రెండు రకాల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
3. రోగనిరోధక శక్తి పెంచుతుంది
పోషకాలు పుష్కలంగా ఉండే చేమదుంపను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంద. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
4. బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్
టారో రూట్ బరువును తగ్గించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అర్బీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే.. ఆహారంలో చేమదుంపలను చేర్చుకోండి.
5. ఉదర సంబంధిత వ్యాధులకు చెక్
అర్బీలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు గ్యాస్, మలబద్ధకం, విరేచనాల వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
6. కంటి చూపు మెరుగు
చేమ దుంప కంటిచూపుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సితోపాటు యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.