Mango Milk Benefits: మామిడి పండ్లను పాలతో కలిపి తినడం తెలుసా..అద్భుత ప్రయోజనాలివే
Mango Milk Benefits: పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి సీజన్ స్పెషల్ ఇది. ఎన్నో పోషక గుణాల్ని సొంతం చేసుకున్న మామిడి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పాలతో మిక్స్ చేసి తింటే..చాలా సమస్యలు దూరమౌతాయనేది తాజా అధ్యయనాలు చెబుతున్నారు..
Mango Milk Benefits: పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి సీజన్ స్పెషల్ ఇది. ఎన్నో పోషక గుణాల్ని సొంతం చేసుకున్న మామిడి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పాలతో మిక్స్ చేసి తింటే..చాలా సమస్యలు దూరమౌతాయనేది తాజా అధ్యయనాలు చెబుతున్నారు..
పండ్ల రారాజు మామిడి పండు రుచిలో, గుణాల్లో అద్భుతం. ఏడాదికోసారి వచ్చే మామిడి పండు నోరూరిస్తుంటుంది. మామిడిలో పోషక గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అందుకే సీజన్‌లో మామిడి పండును తప్పకుండా తినాల్సిందే. అయితే ఇదే మామిడి పండును పాలతో కలిపి తింటే చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
మామిడి పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్ ఎ అనేది కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. కంటి వెలుగును పరిరక్షించడంలో విటమిన్ ఎ కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు..పాలతో కలిపి మామిడి పండ్లు తింటే..మీ కంటి వెలుగు పెరుగుతుంది. చాలామందికి నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతుంది. భోజనం తరువాత ఒక గ్లాసు చల్లటి పాలలో మామిడి ముక్కలు కొన్ని వేసి తింటే..ఆరోగ్యానికి మంచిదే కాకుండా నిద్ర బాగా పడుతుంది.
మామిడి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. పాలలో ప్రోటీన్లు ఉంటాయి. దాంతో ఈ రెండింటి మిశ్రమం మీ ఇమ్యూనిటీని మరింతగా పెంచుతుంది. జలుబు, జ్వరం, దగ్గు వంటివి దూరమౌతాయి. ఏ విధమైన వైరల్ ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. మామిడి పండ్లలో నీటి శాతం ఎక్కువ. దాంతోపాటు ఫైబర్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. అటు పాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఫలితంగా ఈ రెండింటి మిశ్రమం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Also read: Cold Milk Benefits: పాలు తాగే అలవాటుందా..అయితే కోల్డ్‌మిల్క్ తాగండి, బరువు తగ్గించుకోండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook