Joint Pains: జాయింట్ పెయిన్స్ బాధిస్తున్నాయా..అయితే నిర్లక్ష్యం వద్దు
Joint Pains: నిత్యం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. చేతులు, కాళ్ల జాయింట్ పెయిన్స్ ఇందులో ఒకటి. అయితే ఈ నొప్పులున్నప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఇలా బయటపడినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడితే మంచిది. ఇందులో భాగంగానే కాళ్లు, చేతుల జాయింట్ పెయిన్స్ ఒకటి.
మీరు తరచూ కాళ్లు, చేతుల జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దు. ఎందుకంటే ఈ సమస్య పెరిగే కొద్దీ తీవ్రమౌతుంది. జాయింట్ పెయిన్స్‌కు చాలా కారణాలుండవచ్చు. దెబ్బ తగలడం వల్ల, ఇన్‌ఫెక్షన్ లేదా స్వెల్లింగ్ కారణం కావచ్చు. ఇవి కాకుండా ఇంకా ఇతర కారణాలున్నాయి. ఇవి సీరియస్ కారణాలు కావచ్చు. కాళ్లు, చేతుల జాయింట్ పెయిన్స్‌కు కారణాలేంటో చూద్దాం.
చేతులు కాళ్ల జాయింట్ పెయిన్స్‌కు కారణం
దెబ్బ తగలడం
మీకు తరచూ కాళ్లు, చేతుల జాయింట్ పెయన్స్ వస్తుంటే ఎక్కడైనా దెబ్బ తగిలి ఉండవచ్చు. సాధారణంగా దెబ్బలు తగిలినప్పుడు జాయింట్ పెయిన్స్ సంభవిస్తుంటాయి. జాయింట్ పెయిన్స్ నొప్పిగా ఉన్నప్పుడు ఏ విధమైన పని కూడా సక్రమంగా చేయలేక ఇబ్బందులు పడతారు.
వైరల్ ఇన్‌ఫెక్షన్
వైరల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా జాయంట్ పెయిన్స్ వస్తుంటాయి. ఎందుకంటే హెపటైటిస్ సి వైరస్ సోకినప్పుడు జాయింట్ పెయిన్స్ తప్పనిసరిగా కన్పిస్తాయి. జాయింట్స్‌లో విపరీతమైన నొప్పులుంటాయి. అందుకే జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు.
గౌట్
గౌట్ సమస్య తలెత్తినప్పుడు జాయింట్ పెయిన్స్ ప్రధానంగా ఉంటాయి. ఆర్ధరైటిస్‌లో జాయింట్స్‌లో స్వెల్లింగ్ ఉంటుంది. దీని కారణంగా తీవ్రమైన నొప్పి ఉంటుంది.
టెండైనిటిస్ టెండన్
టెండైనిటిస్ టెండన్‌లో కూడా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ నొప్పి మజిల్స్, ఎముకలు రెండింట్లో ఉంటుంది.
Also read: Flipkart Discount Offers: 39వేల రూపాయల ఒప్పో స్మార్ట్‌ఫోన్ కేవలం 12 వేలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook