Side Effects Of Turmeric : మనం ఇంట్లో పసుపు ఉపయోగించని రోజూ అంటూ ఉండదు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కూరలు నుంచి ఆయుర్వేదం వరకు ప్రతి దాంట్లో పసుపును ఉపయోగిస్తాం. ఈ పసుపు అనేది మన జీవన విధానంలో భాగమైపోయింది. పసుపులో యాంటీసెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌, యాంటీఫంగల్‌ వంటి ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇవి వ్యాధులను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో కర్‌క్యుమిన్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ ఉంది. ఇది మధుమేహం, ఒత్తిడి, ఆల్జీమర్స్ వంటి ఎన్నో రోగాల్ని తగ్గించే గుణం ఉంది. దీనిని పరిమిత పరిమాణంలో తీసుకున్నంత వరుకు ఏ ఇబ్బంది ఉండదు. మోతాదుకు మించి వాడితే పసుపు (Side Effects Of Turmeric) వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం
పసుపును అధికంగా తీసుకోవడం వల్ల దానిలో ఉండే ఆక్సలేట్ పరిమాణం మన కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తుంది. అందువల్ల తినే ముందు దాని పరిమాణం గురించి తెలుసుకోండి


డయేరియా రావచ్చు
ఎప్పుడూ బయటి ఆహారం తినడం ఒక్కటే విరేచనాలకు కారణం కాదు.. పసుపు కూడా దీనికి కారణం కావచ్చు. పసుపులో  ఉండే కర్కుమిన్.. పొట్టలోని గ్యాస్ట్రిక్ డక్ట్ సరిగా పనిచేయకుండా చేస్తుంది, దీని కారణంగా డయేరియా సమస్య వస్తుంది.


ఐరన్ లోపం
పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఐరన్ పొడిబారడం ప్రారంభిస్తుంది. దీని వల్ల బలహీనతతో పాటు ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. 


Also Read: Monsoon Diet: వర్షాకాలంలో తరచూ కడుపు సమస్య వస్తోందా..ఈ మూడు తినండి చాలు



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook