శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన పదార్ధం రక్తం. శరీరంలో రక్తం తక్కువైతే చాలా రకాల సమస్యలు ఎదురౌతాయి.  ఈ సమస్యల్ని దూరం చేయాలంటే డైట్‌లో కొన్ని పదార్ధాలు తప్పకుండా చేర్చాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో రక్తం తక్కువైతే..బలహీనత ఎక్కువౌతుంది. తల తిరగడం, అలసట, బలహీనత వంటి కీలక సమస్యలు ఎదురౌతాయి. రానురానూ సమస్యలు తీవ్రమౌతాయి. రక్తం లోపమైతే..ఎనీమియా సంభవిస్తుంది. ఎనీమియా ఉంటే రెడ్ బ్లడ్ సెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువౌతాయి. ఈ సమస్య శరీరంలో ఐరన్ లోపం కారణంగా జరుగుతుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు డైట్‌లో ఐరన్‌తో నిండి ఉన్న పదార్ధాలు తీసుకోవాలి. 


దానిమ్మ ప్రయోజనాలు


దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దానిమ్మను మీ డైట్‌‌లో చేర్చడం ద్వారా హిమోగ్లోబిన్, రక్తం కొరత దూరమౌతుంది. ఇందులో ఐరన్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.


బీట్‌రూట్


బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బీట్‌రూట్ తినడం వల్ల రక్తం వేగంగా పెరుగుతుంది. ఎనీమియా ఉంటే..బీట్‌రూట్ జ్యూస్ చేసుకుని తాగాలి. బీట్‌రూట్ సలాడ్ రూపంలో తినడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. బీట్‌రూట్ తినడం వల్ల రక్తం శుభ్రమౌతుంది. ముఖంపై నిగారింపు వస్తుంది.


యాపిల్


యాపిల్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయి పెంచుతుంది. యాపిల్ డైట్‌లో చేర్చడం ద్వారా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పూర్తవుతుంది. చాలా రోగాల్నించి కాపాడుకోవచ్చు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో ఆరోగ్యానికి చాలా లాభం.


ఉసిరి ప్రయోజనాలు


ఉసిరికాయలు అనేవి ఐరన్‌కు అద్భుతమైన సోర్స్. ఇందులో విటమిన్ సి, కాల్షియం కూడా పెద్దమొత్తంలో ఉంటాయి. ఎనీమియా ఉన్నప్పుడు ఉసిరి చాలా మంచిది. ఉసిరితో క్యాండీ, పౌడర్ వంటివి తింటే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల శరీరంలో రక్తం లోపముంటే దూరమౌతుంది.


రెడ్‌మీట్ లాభాలు


నాన్‌వెజ్ తినేవారికి రెడ్‌మీట్ ద్వారా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఐరన్‌తో పాటు ప్రోటీన్లు, సెలేనియం, విటమిన్ బి వంటి పోషక పదార్ధాలున్నాయి. చాలా సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.


Also read: Winter Fruits: చలికాలంలో ఆ నాలుగు పండ్లు తింటే చాలు..ఏ రోగం దరిచేరదిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook