Health Insurance Tips: ఆరోగ్య బీమా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నిస్సందేహంగా మంచిదే. ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో చెప్పలేం. ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం కలుగుతుందో చెప్పలేనప్పుడు ఆరోగ్య బీమా ఉంటే ధీమాగా ఉంటుంది. మరి ఎలాంటి బీమా ఎంచుకోవాలనేదే అసలు ప్రశ్న. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏదైనా అనుకోని అనారోగ్య సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే జీవితాంతం కష్టించి పనిచేసిన డబ్బంతా ఆసుపత్రి చికిత్సకు వృధా కాకుండా ఉండేందుకు అక్కరకు వస్తుంది ఆరోగ్య బీమా. ఇటీవలి కాలంలో ముఖ్యంగా కరోనా సంక్షోభం తరువాత ఆరోగ్య బీమా పధకాలకు ఆదరణ పెరిగింది. అయితే ఇవి తీసుకునేటప్పుడు చాలా విషయాలు పరిశీలించి తీసుకోవాలి. లేకపోతే అవసరమైనప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కీలకంగా గమనించాల్సిన, పరిశీలించాల్సిన అంశాలివే...


1. ఆసుపత్రిలో చేరినప్పుడు రూమ్ రెంట్ అనేది మొత్తం బీమా కంపెనీనే చెల్లిస్తుందో లేదో చూసుకోవాలి. 50 శాతం చెల్లించే షరతులుంటే తీసుకోకూడదు. అంటే గది అద్దెపై ఏ విధమైన పరిమితి లేకుండా ఉండే పాలసీ ఎంచుకోవాలి.


2. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే కాకుండా డిశ్చార్జ్ అయిన తరువాత అయ్యే ఖర్చుల్ని ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుందో లేదో చెక్ చెసుకోవాలి. అలాంటి కంపెనీ పాలసీనే తీసుకోవాలి. సాధారణంగా ఈ తరహా పాలసీలు 30-60 రోజులు గరిష్టంగా 60-180 రోజుల వ్యవధితో ఉంటాయి


3. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో నిర్ణీత వ్యాధులకే క్లెయిమ్ వర్తిస్తుంది. అయితే కొన్ని పాలసీల్లో ఆ నిర్ణీత వ్యాధులకు కూడా పరిమితి విధిస్తుంటాయి. ఇవి లేకుండా చూసుకోవాలి. అంటే మీ పాలసీ లిమిట్‌కు లోబడి ఎంతైనా కంపెనీనే భరించేలా ఉండే పాలసీలే తీసుకోవాలి. 


4. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని రకాల వ్యాధుల చికిత్స విషయంలో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇవి లేకుండా చూసుకోవడం చాలా అవసరం. అంటే రక్తపోటు, మధుమేహం, కేన్సర్, కిడ్నీ వంటి వ్యాధులకు పాలసీ తీసుకున్న ఏడాది తరువాతే వర్తిస్తుందనే నిబంధనలుంటాయి. ఈ తరహా నిబంధనలుంటే తీసుకోకపోవడమే మంచిది. 


5. మరోవైపు పాలసీలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితా అనేది చాలా ముఖ్యం. లేకపోతే నగదు రహిత చికిత్స అందదు. ముందు మీరు చెల్లించి తరువాత బిల్స్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలా చేస్తే చాలా ఇబ్బందులుంటాయి. నెట్‌వర్క్ ఆసుపత్రులు, క్యాష్‌లెస్ ప్రోసెస్ ఉంటేనే మంచిది.


6. ఇక మరో ముఖ్యమైన విషయం రోజువారీ చికిత్స ఉండే పాలసీలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్నట్టు ఆసుపత్రుల్లో 2-3 రోజులు చేరి చికిత్స తీసుకోవడం జరగడం లేదు. ఒకేరోజులో చికిత్స పూర్తయి ఇంటికి డిశ్చార్జ్ అవుతున్నారు. ఉదాహరణకు డయాలసిస్, కీమోథెరపీ ముఖ్యమైనవి. అందుకే డే కేర్ ఉందో లేదో పరిశీలించాలి.


Also read: Diabetes Prevention Tips: ఈ 5 అలవాట్లు అలవర్చుకుంటే డయాబెటిస్ ముప్పు ఉండదిక


7. ఆరోగ్య బీమా పాలసీ పరిమితిని వాడేసిన ఏడాది వ్యవధిలో వాడేసిన తరువాత ఆటోమేటిక్‌గా రీఛార్జ్ అయ్యే పాలసీలు ఎంచుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తికి ఆరోగ్య బీమా వర్తించి లిమిట్ పూర్తయ్యాక, ఆ కుటుంబంలో మరో వ్యక్తికి ఏమైనా జరిగితే బీమా వర్తించేలా ఉండాలి.


Also read: Belly Fat tips: ఈ రెండు ఫ్రూట్స్ డైట్‌కు దూరం చేస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook