Monsoon Healthy Diet: వర్షాకాలంలో కడుపు సంబంధిత సమస్యలకు ఇలా చెక్ పెట్టండి
Monsoon Healthy Diet:: వర్షాకాలం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. వివిధ రకాల ఇన్ ఫెక్షన్ల కారణంగా ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతుంటుంది. అందులో ముఖ్యమైంది కడుపు సంబంధిత సమస్య. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం తినాలో తెలుసుకుందాం..
Monsoon Healthy Diet: వర్షాకాలం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. వివిధ రకాల ఇన్ ఫెక్షన్ల కారణంగా ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతుంటుంది. అందులో ముఖ్యమైంది కడుపు సంబంధిత సమస్య. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం తినాలో తెలుసుకుందాం..
మండే ఎండల్నించి వర్షాకాలం ఉపశమనం కల్గించినా..ఆరోగ్యపరంగా వర్షాకాలం ఎప్పుడూ మంచిది కాదు. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు దాడి చేసి అనారోగ్యానికి కారణమౌతుంటాయి. వర్షాకాలంలో తల వెంట్రుకల్నించి చర్మం వరకూ అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంటుంది. వర్షాకాలంలో శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందుకే తినే ఆహార పదార్ధాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సరిగ్గా జీర్ణ కాక సమస్యగా మారుతుంది. కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం ద్వారా కడుపు సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
కడుపు సంబంధిత సమస్యలకు ఇలా చెక్
పెరుగు పోషక పదార్ధాలతో నిండి ఉంటుంది. వర్షాకాలంలో వివిధ ఇన్‌ఫెక్షన్ల కారణంగా లేదా చెడు ఆహార పదార్ధాల కారణంగా కడుపు సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు సాధ్యమైనంతవరకూ పెరుగు మాత్రమే తీసుకోవాలి. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పుష్కలంగా ఉండే ప్రో బయోటిక్స్ ప్రేగుల్లోని గుడ్ బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. ఫలితంగా కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. లంచ్ సమయంలో తప్పకుండా పెరుగు తీసుకోవడం మంచిది. అదే సమయంలో రాత్రిపూట పెరుగు తీసుకోకూడదు.
అరటిపండ్లు
అరటిపండు సాధారణంగా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఆరోగ్యపరంగా అన్ని ప్రయోజనాలున్నాయి. డయాబెటిస్ తప్ప అందరికీ ఇది మంచిది. అరటి పండ్లతో ఎక్కువసేపు ఎనర్జటిక్‌గా ఉండగలం. కడుపు సంబంధిత చాలా సమస్యలకు అరటిపండ్లు చెక్ పెడతాయి. జీర్ణక్రియకైతే అరటిపండ్లను మించింది లేదు.
నిమ్మరసం
నిమ్మరసం చాలా సమస్యలకు పరిష్కారమని చాలామందికి తెలియదు. ఒంట్లో వేడి చేసినా లేదా డీహ్రైడ్రేషన్ ఏర్పడినా లేదా కడుపులో వికారంగా ఉన్నా నిమ్మరసం అద్భుతమైన చిట్కా. నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. దాంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో కడుపు సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు నిమ్మరసం మంచి పరిష్కారం. దీనివల్ల శరీరానికి చలవ చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి