Diabeitc Diet Tips: డయాబెటిక్ రోగులు ఈ కూరగాయలు అస్సలు తినకూడదు
Diabeitc Diet Tips: కూరగాయలు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులైతే కొన్ని రకాల కూరగాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Diabeitc Diet Tips: కూరగాయలు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులైతే కొన్ని రకాల కూరగాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మాంసాహారం కంటే శాకాహారం ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు కొందరు. ఈ విషయం ఎంతవరకూ నిజమో కాదో గానీ కూరగాయలు మాత్రం ఆరోగ్యానికి మంచివే. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే కూరగాయలు అందరికీ మంచిది కాకపోవచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు కొన్ని రకాల కూరగాయలు హాని చేకూరుస్తాయి. డయాబెటిక్ రోగులు ఏ కూరగాయల్ని తీసుకోకూడదో తెలుసుకుందాం..
డయాబెటిక్ రోగులకు బంగాళాదుంపలు మంచివి కావు. చాలా హాని కారకంగా మారుతాయి. ఇందులో అధికంగా ఉండే స్టార్చ్ వల్ల కార్బోహైడ్రేట్స్ అధికమౌతాయి. మరోవైపు గ్లైసోమిక్ ఇండెక్స్ ఉంటుంది. బేక్ చేసిన బంగాళాదుంపలో గ్లైసోమిక్ ఇండెక్స్ 111 వరకూ ఉంటుంది. ఉడకబెట్టిన దుంపలో 82 ఉంటుంది. ఈ రెండు పరిణామాలు డయాబెటిక్ రోగులకు హాని కల్గిస్తాయి. మొక్కజొన్న కూడా డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. ఇందులో గ్లైసోమిక్ ఇండెక్స్ 52 ఉంటుంది. కానీ ఇందులో ఉండే ఫైబర్ మరో ఆహారపదార్ధాల్లోనూ ఉండదు. ఫలితంగా డయాబెటిస్ రోగులకు నష్టం కల్గిస్తుంది. ఒకవేళ తినాలనుకుంటే హై ఫైబర్ ఉండే ఆహారంతో తీసుకోవాలి.
ఇక బఠానీలో కూడా కార్పోహైడ్రైట్స్ ఎక్కువే. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు బఠానీ నుంచి దూరంగా ఉండాలి. బఠానీ గ్లోైసోమిక్ ఇండెక్స్ 51 ఉంటుంది. అందుకే బఠానీ కూడా డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది వెజిటెబుల్ జ్యూస్. చాలామంది ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశ్యంతో వెజిటబుల్ జ్యూస్ తాగుతుంటారు.వెజిటబుల్ జ్యూస్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. ఫైబర్..బ్లడ్ షుగర్ లెవెల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే వెజిటబుల్ జ్యూస్ మంచిది కాదు.
Also read: Viral Fevers: వర్షాకాలంలో వైరల్ జ్వరాలకు కారణాలేంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook