Weight Loss Tips: కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా..?

Weight Loss in 7 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం, మధుమేహాం సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానకి చాలా వివిధ రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2022, 04:00 PM IST
  • కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు
  • క్రమం తప్పకుండా కరివేపాకు రసం తాగితే
  • సులభంగా బరువు తగ్గుతారు
Weight Loss Tips: కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా..?

Weight Loss in 7 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం, మధుమేహాం సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానకి చాలా వివిధ రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయినప్పటీకీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేక పోతున్నారు. అయితే ఇలాంటి క్రమంలో పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాలను నిపుణులు తెలుపుతున్నారు. బరువు నియంత్రణ క్రమంలో కరివేపాకుని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకులో ఉండే గుణాలు బరువును కూడా నియంత్రిస్తాయని నిపుణులు అభిప్రాపడుతున్నారు.

కరివేపాకులో ఔషధ గుణాల ఉంటాయి. కావున శరీర అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది. కరివేపాకులో ఉండే గుణాలు శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. ముఖ్యంగా శరీరంలో కేలరీలను బర్న్ చేసి పేరుకుపోయిన కొవ్వులను తొలగించేందుకు సహాయపడతాయి. కరివేపాకులో ఐరన్, జింక్, కాపర్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫోలిక్ యాసిడ్ మొదలైనవి ఉంటాయి. ఇవి శరీర బరువును నియంత్రిస్తాయి.

ఈ ఆకులను ఇలా తినాలి:

కరివేపాకు రసం:

కరివేపాకు రసం చేసుకోవడానికి ముందు 20 నుంచి 30 కరివేపాకులను, ఒక గ్లాసు నీరు తీసుకోండి. తర్వాత బ్లెండర్‌లో వేసి 30 నుంచి 40 సెకన్ల పాటు బ్లెండ్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి తాగాలి. కావాలంటే పుదీనా ఆకులను కూడా ఇందులో వేసి మిక్స్‌ చేసుకుని తాగొచ్చు. దీనిని క్రమం తప్పకుండా రోజూ ఉదయం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా ఈ రసం తీసుకోవాలి.

కరివేపాకుతో చేసిన జ్యూస్‌:

బరువు తగ్గడానికి కరివేపాకుని వినియోగించడం వల్ల  మీరు సులభంగా బరువు తగ్గుతారు. ఇది తయారు చేయడం చాలా సులభం. దీన్ని తయారు చేయడానికి.. 10 నుంచి 20 కరివేపాకులను తీసుకొని వాటిని కొన్ని నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి.. అందులో కొంచెం నిమ్మ రసం జోడించి ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా మధుమేహం సమస్యలు కూడా దూరమవుతాయి.

Also Read: Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..

Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News