హార్ట్ ఎటాక్. అత్యంత ప్రమాదకరమైంది. గుండెలోని ధమనులు, సిరలు కుదించుకుపోవడం వల్ల ప్రధానంగా ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని పదార్ధాల్ని డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణం రక్త నాళికలు కుదించుకుపోవడం. ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ధమనులు, సిరలు కుదించుకుపోవడానికి కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తే గుండెపోటు సమస్య తగ్గినట్టే. మరి కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఫ్లెక్స్ సీడ్స్ అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. 


ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఫిట్‌నెస్ ఉన్నా..హార్ట్ ఎటాక్ సంభవిస్తుంటుంది. హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణం ఎప్పుడూ కొలెస్ట్రాల్ మాత్రమే అయుంటుంది. చాలామంది కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా..ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు. దాంతో గుండెపోటు సమస్య అధికమౌతుంది. అందుకే హార్ట్ ఎటాక్ సమస్య నుంచి రక్షించుకోవాలంటే..ముందు కొలెస్ట్రాల్‌ను అరికట్టాలి. ఇవాళ్టి నుంచే డైట్‌లో ఫ్లెక్స్ సీడ్స్ భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్ తప్పకుండా నియంత్రణలో వచ్చేస్తుంది.


కొలెస్ట్రాల్ తగ్గించడం ఎలా


తినే ఆహార పదార్ధాలు సరిగా లేకపోవడం, ఫ్యాట్ పదార్ధాలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే ఎప్పుడూ ఆరోగ్యకరమైన పదార్ధాలే సేవించాలి. ఫ్లెక్స్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఫ్లెక్స్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, సాల్యుబుల్ పైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడతాయి.ఫ్లెక్స్ సీడ్స్‌లో ఉండే పోషకాలు రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది. 


ఫ్లెక్స్ సీడ్స్ ఎలా తీసుకోవాలి


ఫ్లెక్స్ సీడ్స్ రోజూ డైట్‌లో భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అయితే ఫ్లెక్స్ సీడ్స్‌ను పచ్చివి కాకుండా..ఫ్రై చేసినవి తినాలి. రోజుకు ఒక స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ చాలు. ఫ్లెక్స్ సీడ్స్ ఫ్రై చేసి..హల్వా లేదా లడ్డూ రూపంలో కూడా తీసుకోవచ్చు.


ఫ్లెక్స్ సీడ్స్‌లో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఫ్లెక్స్ సీడ్స్ అందరికీ మంచిది కాదు. ఎలర్జీ, స్వెల్లింగ్ సమస్య ఉన్నవారు ఫ్లెక్స్ సీడ్స్ తినకూడదు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉన్నందున కిడ్నీ రోగులకు మంచిది కాదు. 


Also read: Heart Attack: గుండెపోటుకు కారణాలు ఇవే.. వీటిని తింటే జీవితంలో హార్ట్ ఎటాక్ రాదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook