Cardamon Benefits: రోజూ తీసుకుంటే..అధిక రక్తపోటు, కేన్సర్, బ్లడ్ షుగర్ సమస్యలకు చెక్
Cardamon Benefits: ప్రతి కిచెన్‌లో తప్పనిసరిగా లభించే ఇలాచీతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. అధిక రక్తపోటును సైతం ఇట్టే నియంత్రిస్తుంది. ఇలాచీతో కలిగే పూర్తి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ఇలాచీ అనేది ఓ విభిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. కాస్త తీపిగా కాస్త ఘాటుగా ఉంటుంది. ఇలాచీ లేకుండా గరం మసాలా అనేది ఊహించలేం. అదే సమయంలో ఇలాచీతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికం. ఇలాచీతో చాలా వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు.
ఇలాచీ. ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పకుండా లభించే గరం మసాలా దినుసుల్లో ఒకటి. ప్రతిరోజూ ఇలాచీ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, విటమిన్ సి, మినరల్స్, ఐరన్, కాల్షియం వంటి పోషక పదార్ధాలతో నిత్యం ఎదుర్కొనే వివిధ రకాల వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు వంటి గంభీరమైన సమస్యల్ని కూడా ఇట్టే తగ్గిస్తుంది.
ఇలాచీతో కలిగే ప్రయోజనాలు
రక్తపోటు తగ్గించడంలో
ఇలాచీ తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. రోజూ 3 గ్రాముల ఇలాచీ క్రమం తప్పకుండా తీసుకుంటే..బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో వచ్చేస్తుంది. రక్తపోటును నివారించడంలో ఇలాచీ అద్బుతంగా పనిచేస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపర్చడంలో..
ఇలాచీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్య దూరమౌతుంది. దాంతోపాటు అల్సర్ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. ఇలాచీ నీళ్లు క్రమం తప్పకుండా నిర్ణీత పద్ధతిలో తీసుకుంటే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. ఈ క్రమంలో మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది.
స్వెల్లింగ్ నియంత్రణ
ఇలాచీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. శరీరంలో మజిల్స్ స్వెల్లింగ్ సమస్యకు ఇలాచీ అద్భుతమైన చికిత్సగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మజిల్స్ డ్యామేజ్ కాకుండా దోహదపడతాయి.
మధుమేహం నియంత్రణ
ఇలాచీ రోజూ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇలాచీని పౌడర్ రూపంలో చేసుకుని కూడా తీసుకోవచ్చు. రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
కేన్సర్ నియంత్రణలో
ఇలాచీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లలో కేన్సర్‌తో పోరాడే లక్షణాలుంటాయి. దీనికోసం ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇలాచీ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేన్సర్ సెల్స్‌ను నాశనం చేయడంలో ఉపయోగమౌతుంది.
Also read: Health Tips: భోజనానంతరం పొరపాటున కూడా చేయకూడని తప్పులివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook