Heart Attack Symptoms: గుండె సంబంధిత వ్యాధుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండె వ్యాధులు అన్నింటికంటే ప్రమాదకరమైనవి. గుండె వ్యాధుల్ని ప్రాధమికంగా గుర్తించకపోతే ముప్పు తీవ్రమౌతుంది. గుండె వ్యాధుల ప్రాధమిక లక్షణాలు కూడా చాలా సామాన్యంగానే ఉంటాయి. ముఖ్యంగా అలసట, శ్వాస ఇబ్బంది, ఛాతీలో తేలికపాటి నొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. మనం వాటిని తేలిగ్గా తీసుకుంటాం. కానీ గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే ప్రతి చిన్న లక్షణాన్ని సీరియస్‌‌గా తీసుకోవాలి. మీ దైనందిక జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..


ధూమపానం అనేది గుండెకు హాని కల్గిస్తుంది. స్మోకింగ్ వల్ల కేవలం మీ గుండె మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. మెదడుకు హాని చేకూరుతుంది. మీరు కూడా స్మోకర్స్ అయితే వెంటనే ఆ అలవాటు మానేయండి. ఎక్కువసేపు ఒకేచోట కూర్చునే పని చేస్తుంటే అది మీ గుండెపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది. కూర్చుని ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ , బ్లడ్ షుగర్ రెండూ పెరుగుతాయి కూర్చుని ఉండటం వల్ల కాళ్లలోని మజిల్స్ పటిష్టంగా ఉండవు. ఫలితంగా రక్తంలో ఫ్యాటీ యాసిడ్స్ నియంత్రణ సాధ్యం కాదు. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి


మానసికంగా ఎక్కువ ఒత్తిడి లేదా ఆందోళను గురైనా గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్, ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతాయి. ఈ రెండూ గుండె వ్యాధులకు కారణాలు. అందుకే ఎప్పుడూ స్ట్రెస్‌కు దూరంగా ఉండాలి. స్ట్రెస్ తగ్గించేందుకు యోగా, మెడికేషన్ చాలా అవసరం. 


Also read: Cholesterol Symptoms: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో చెప్పేస్తాయి ఈ లక్షణాలు, తస్మాత్ జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.