Cholesterol Symptoms: మనిషి శరీరంలో ప్రమాదకర వ్యాధులకు కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో చాలా అప్రమత్తత అవసరం. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉంది..కొలెస్ట్రాల్ సోకిందా లేదా అనేది గమనిస్తుండాలి. మరి ఎలా తెలుస్తుంది..ఆ లక్షణాలెలా ఉంటాయి..ఆ వివరాలు మీ కోసం...
ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇందులో ప్రధానంగా అజీర్ణం, మలబద్ధకం, స్థూలకాయం, డయెబెటిస్, అధిక రక్తపోటు, గుండెపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తరచూ చూస్తుంటాం. అన్నింటికీ మూల కారణం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే అన్నీ సవ్యంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఎల్‌డీఎల్ అంటే ఇది శరీరానికి మంచిది కాదు. రెండవది హెచ్‌డీఎల్..దీన్నే గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువైతే కొన్ని లక్షణాలు సాధారణంగా బయటకు కన్పిస్తుంటాయి. ఆ లక్షణాలేంటో చూద్దాం..
ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి శరీరంలో ఎప్పుడూ తక్కువగా ఉండాలి. అదే సమయంలో హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటే మంచిది. తీసుకునే ఆహారంలో మార్పులతో కొలెస్ట్రాల్ నియంత్రణ సాధ్యమే. సాధ్యమైనంతవరకు బయటి తిళ్లు ముఖ్యంగా శెనగపిండితో చేసే బజ్జీలు, పకోడీ, మసాలా పదార్ధాలు, ఫ్రైడ్ పదార్ధాలకు దూరంగా ఉంటే..కొలెస్ట్రాల్ నియంత్రించవచ్చు.
1. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే కాళ్లలో వాపు ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉంటే కాళ్లు ఉన్నట్టుంది తిమ్మిరెక్కుతుంటాయి. కాళ్లలో బ్లాకేజ్ ఉండటం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ తగ్గి..సమస్యలు ఎదురౌతాయి.
2. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కన్పించే ప్రధాన లక్షణం గుండెపోటు. ఇదొక ప్రమాదకరమైన లక్షణం. ప్రాణాంతమైంది. ముందుగా ఆర్టరీస్‌లో బ్లాకేజ్ రావడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇదే గుండెపోటుకు కారణమౌతుంది.
3. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. బీపీ పెరుగుతుందంటే..కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని అర్ధం. అందుకే కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా చూసుకోవాలి.
4. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనశ్సాంతి తగ్గుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విసుగు, అలసట, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు ఎదురౌతాయి.
5. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గోర్ల రంగు మారుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనుల్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది. రక్త ప్రసరణ తగ్గుతుంది. గోర్ల రంగు లేత గులాబీ రంగులో కన్పిస్తాయి. అందుకే గోర్ల రంగు మారినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదు.
కొలెస్ట్రాల్ నియంత్రణకు
బ్రౌన్ రైస్‌లో పుష్కలంగా లభించే పోషక పదార్ధాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇందులో లభించే ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులు, ముప్పును తగ్గిస్తాయి. ఇందులో లిగ్నాన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
Also read: Weight loss Tips: బరువు తగ్గే క్రమంలో పొరపాటున కూడా చేయకూడని ఆ తప్పులేవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.