Kidney Disease Signs: ఇటీవలి కాలంలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. కారణం వివిధ రకాల ఆహారపు అలవాట్లు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే మొత్తం శరీరంపై ఆ ప్రభావం పడుతుంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర స్థాయికి దారి తీస్తుంది. కిడ్నీలో సమస్య ఉంటే అసలు ఎలా తెలుస్తుంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజూ మనం తినే ఆహారం జీర్ణమయ్యేటప్పుడు వివిధ రకాల వ్యర్ధాలు, రసాయనాలు విడుదలవుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు తొలగించడం అవసరం. ఈ పని చేసేది కిడ్నీలే. అంటే కిడ్నీలు ఫిల్టర్ లా పనిచేస్తాయి. వ్యర్ధాల్ని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. రోజూ అదే పనిగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తినడంతో పాటు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్ల కారణంగా మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. జంక్ ఫుడ్స్ ను కిడ్నీలు కూడా సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. దాంతో కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పరిస్థితి ఒకేసారి జరగదు. క్రమ క్రమంగా జరుగుతుంది కాబట్టి కిడ్నీలో సమస్య తలెత్తిందనే విషయం కూడా మనకు తెలియదు. దాంతో పరిస్థితి ప్రమాదకరమైనప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కిడ్నీలో సమస్య ఏర్పడినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయంటున్నారు వైద్యులు. ఈ మార్పుల్ని మీరు గుర్తించగలిగితే కిడ్నీలో సమస్య ఉందని అర్దం చేసుకోవచ్చు.


ఎప్పుడైతే కిడ్నీలు వ్యర్ధాల్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేవో అప్పుడా వ్యర్ధాలు చర్మం కిందపేరుకుపోతాయి. దాంతో చర్మంలో దద్దుర్లు, దురద మొదలవుతుంది. ఇది కిడ్నీ సమస్యకు సంకేతమే. ఊపిరి సరిగ్గా ఆడకపోవడం కూడా ఓ లక్షణమే. వ్యర్ధాల్ని సరిగ్గా తొలగించకపోతే ఊపిరితిత్తుల్లో చేరి శ్వాసకు ఇబ్బందిగా మారతాయి. ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్ రావచ్చు.


కిడ్నీల్లో సమస్య ఉంటే మొదటి మార్పు లేదా సంకేతం మూత్ర విసర్జనతోనే కన్పిస్తుంది. ఎందుకంటే కిడ్నీల సంబంధం నేరుగా మూత్రంతోనే ఉంటుంది. కిడ్నీలే మూత్రాన్ని తయారుచేసి బయటకు పంపిస్తాయి. కిడ్నీల్లో సమస్య ఏర్పడినప్పుుడు మూత్రం సరిగ్గా రాదు. లేదా మూత్రం రంగు మారవచ్చు లేదా మూత్రం పోసేటప్పుడు మంట, నొప్పి ఉండవచ్చు. ఈ సంకేతాలు నిస్సందేహంగా కిడ్నీ సమస్య లక్షణాలే.


కిడ్నీల్లో సమస్య ఉంటే కాలి పాదాల్లో వాపు కచ్చితంగా కన్పిస్తుంది. ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే హిమోగ్లోబిన్ తగ్గి ఆ ప్రభావం పాదాలపై కన్పిస్తుంది. మీకు తరచూ ఆకలి వేయకపోవడం ఉంటే అది కిడ్నీ సమస్యకు లక్షణం కావచ్చు. వ్యర్ధ పదార్ధాలు కడుపులో ఉండిపోయి ఆకలి వేయదు. కిడ్నీల్లో సమస్య ఉంటే వ్యర్ద పదార్ధాలు లేదా విష రసాయనాలు మెదడుకు సైతం చేరుకుంటాయి. దాంతో ఏకాగ్రత తగ్గుతుంది. మూర్చ రోగం కూడా రావచ్చు.


Also read; 5 Harmful Effects Of Noodles: నూడుల్స్ తినేవారికి భవిష్యత్‌లో ఈ వ్యాధులు తప్పవట, మీరు కూడా తింటున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook