Harmful Effects Of Noodles: ఫాస్ట్ ఫుడ్స్ నోటికి ఎక్కువ రుచిని అందిచేవాటిలో నూడుల్స్ ఒకటి..వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రస్తుతం ఇవి మార్కెట్‌లో ఇన్‌స్టంట్ ప్యాకెట్స్‌లో కూడా లభిస్తున్నాయి. ఇన్‌స్టంట్ నూడుల్స్‌ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా వదిలిపెట్టకుండా తింటారు. ఇందులో అధిక పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లభిస్తాయి. కాబట్టి వీటిని పరిశోధకులు జంక్ ఫుడ్‌గా భావిస్తారు. అచితే ప్రతి రోజు తినేవారు శరీరంపై తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అధిక సీసం మూలకాలు:
నూడుల్స్ చాలా రుచిగా ఉండడానికి ప్రధాన కారణాలు సీసం మూలకాలేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సీసం మూలకాలు తక్కువ పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు సులభంగా వస్తాయి. అంతేకాకుండా ఇది కొందరిలో ప్రాణాంతకంగా మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
నూడుల్స్ ఎక్కువగా తినేవారిలో వచ్చే సమస్యలు:
✩ రక్తహీనత
✩ కీళ్ల నొప్పి
✩ జ్ఞాపకశక్తి బలహీనంగా మారడం
✩ నరాల బలహీనత
✩ వినికిడి లోపం
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
నూడుల్స్ పిండి ప్రమాదమేనా?:
నూడుల్స్ తయారు చేసే పిండి చాలా హానికరమని ఆరోగ్య నిపులనులు చెబుతున్నారు. వీటిని ప్రతి రోజు తింటే..తీవ్ర అనారోగ్య సమస్యలైన కాలేయ సమస్యలు, కీళ్ల నొప్పులు, అలసట వంటి సమస్యల రావచ్చు. కాబట్టి అతిగా నూడుల్స్‌ను ఆహారంగా తీసుకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చిన్నారులు, గర్భిణుల ప్రాణాలకు ముప్పే:
నూడుల్స్‌లో తక్కువ పరిమాణంలో సీసం మూలకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని పిల్లలు, గర్భిణీ స్త్రీలు అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్, సోడియం పరిమాణాలు పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు. అంతేకాకుండా కొంతమందిలో ఊబకాయం వంటి సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి