Blood Transfusion: సాధారణంగా రక్తదానం చేసేటప్పుడులేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తికి రక్తం ఎక్కించేటప్పుడు అదే గ్రూప్ రక్తాన్ని మాత్రమే ఎక్కిస్తుంటారు. ఒకదానికి మరొకర గ్రూప్ రక్తాన్ని పొరపాటున కూడా ఎక్కించరు. ఒకవేళ పొరపాటున ఒక గ్రూప్‌కు బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తే ఏమౌతుంది..ఆ వ్యక్తి ప్రాణాలు పోతాయా పూర్తి వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరంలో ఉండే రక్తంలోని ప్లాస్మాలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్ కలిసి ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ఆధారంగా లభించే యాంటీజన్ ప్రకారం మనిషి బ్లడ్ గ్రూప్ ఏదనేది నిర్ధారిస్తారు. బ్లడ్ గ్రూప్ అనేది తల్లిదండ్రుల నుంచి డీఎన్ఏ ద్వారా ప్రాప్తిస్తుంటుంది. అంటే పిల్లలకు తల్లి లేదా తండ్రి బ్లడ్ గ్రూప్ వారసత్వంగా వస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్‌లో రెండు రకాల యాంటీ జెన్‌లు ఉంటాయి. ఇవి యాంటీజెన్ ఎ, యాంటీజెన్ బి. రక్తంలో యాంటీజెన్ ఎ ఉంటే బ్లడ్ గ్రూప్ ఎ అవుతుంది. యాంటీజెన్ బి ఉండే బ్లడ్ గ్రూప్ బి అవుతుంది. రెండూ కలిసి ఉంటే ఏబి బ్లడ్ గ్రూప్ అవుతుంది. రెండూ లేకపోతే ఓ గ్రూప్ అవుతుంది.


పొరపాటున మరో గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏం జరుగుతుంది


ఒకవేళ ఒక గ్రూప్‌కు బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తే పరిస్థితి విషమంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఎక్యూట్ హెమోలిటిక్ ట్రాన్స్‌ఫ్యూజన్ రియాక్షన్ సంభవిస్తుంది. ఇలా జరిగితే తీవ్రమైన జ్వరం, బ్యాక్ పెయిన్స్, తీవ్రమైన వణుకు లక్షణాలు కన్పిస్తాయి. ఎప్పుడైనా ఓ మనిషి శరీరంలో మరో బ్లడ్ గ్రూప్ ఎక్కించినప్పుడు ఆ మనిషిలో ఉండే రోగ నిరోధక శక్తి ఆ రక్తాన్ని నష్టపర్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు పైన ఉదహరించిన లక్షణాలు బయటపడతాయి. ఈ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వెంటనే హెమోడైనమిక్స్ బ్యాలెన్స్ చేస్తూ చికిత్స అందించాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇది అత్యయిక పరిస్థితి.


ఒకదానికి బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఆ వ్యక్తి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయి. కాస్సేపటి తరువాత పూర్తిగా పనిచేయడం ఆగిపోవచ్చు. యూరిన్‌లో రక్తం, ఫ్లూ వంటి సమస్యలు, షాక్ తగలడం, మరణం వరకూ పరిస్థితి దారితీయవచ్చు. అందుకే రక్తం ఎక్కించేటప్పుడు లేదా రక్తం సేకరించేటప్పుడు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు.


Also read; Dengue Threat: వర్షాకాలంలో పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు, లక్షణాలేంటి, ఏం చేయాలి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook