Watermelon Side Effects: ఎండాకాలంలో వడగాల్పుల కారణంగా ప్రధానంగా ఎదురయ్యే అనారోగ్య సమస్య వడదెబ్బ తగలడం. ఇది ఎంత సులభంగా కన్పిస్తుందో అంతే తీవ్రమైంది. వృద్ధులకైతే ప్రాణాంతకం కూడా. శరీరం పూర్తిగా డీహ్రైడ్రేట్ అయినప్పుడు ఈ పరిస్థితి ఎదురౌతుంది. అందుకే ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు తినమని వైద్యులు సూచిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు అనగానే ముందుగా గుర్తొచ్చేది చల్లచల్లని పుచ్చకాయ. నిజంగా ఆరోగ్యపరంగా అద్భుతమైంది. ఏ మాత్రం సందేహం లేదు. పుచ్చకాయ ఎక్కువగా లభించేది కూడా వేసవి సీజన్‌లోనే. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచేందుకు పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది. పుచ్చకాయను నేరుగా తీసుకోవడమో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడమే చేస్తుంటాం. రుచిలో కూడా బాగుండటంతో సాధారణంగా పుచ్చకాయను ఇష్టపడనివారుండరు. వేసవిలో బెస్ట్ హైడ్రేటెడ్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అనే కారణంగా అదే పనిగా అంటే అతిగా తినడం కూడా ప్రమాదకరమంటున్నారు వైద్యులు. అవును..నిజమే పుచ్చకాయతో ఎన్ని ప్రయోజనాలున్నాయో అతిగా తీసుకుంటే అన్నే దుష్పరిణామాలున్నాయి. అందుకే మితిమీరి పుచ్చకాయ తినకూడదు. లేకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. 


పుచ్చకాయతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా


పుచ్చకాయను అతిగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో తేడా రావచ్చు. ఎందుకంటే ఇందులో సహజసిద్ధమైన చెక్కర ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. ఇది రక్తంలో నేరుగా కలవడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు చక్కెర శాతం పెరగవచ్చు. అందుకే డయాబెటిక్ రోగులు రోజుకు 1 లేదా 2 ముక్కలు మాత్రమే తినాలి. మరీ ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు పుచ్చకాయ ఎక్కువగా తిన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికమైనట్టు ఓ అధ్యయనంలో గుర్తించారు. 


పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువే. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ అదే పనిగా ఎక్కువగా తినడం వల్ల ఇందులో ఉండే నేచురల్ షుగర్, ఫ్రక్టోజ్ వల్ల విరేచనాలు కలగవచ్చు. అందుకే మితంగా తీసుకోవడం మంచిది. పుచ్చకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఉత్పన్నం కావచ్చు. 


పుచ్చకాయను ఆరోగ్యానికి మంచిదనే కారణంతో అతిగా తింటే ఎలర్జీ లక్షణాలు కూడా రావచ్చు. ముఖ్యంగా శరీరంపై దద్దుర్లు, దురద  లక్షణాలు కన్పిస్తాయి. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. పుచ్చకాయ అతిగా తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ దెబ్బతినవచ్చు. అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం బ్యాలెన్స్ తప్పి ఇతర అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు.


Also read: Sunburn vs Cancer: ఎండల్లో ఎక్కువసేపుంటే కేన్సర్ రావచ్చా, నిజానిజాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook