Sunburn vs Cancer: ఎండల్లో ఎక్కువసేపుంటే కేన్సర్ రావచ్చా, నిజానిజాలేంటి

Sunburn vs Cancer: ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. ఎండలు రోజురోజూకూ తీవ్రంగా ఉంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా తీవ్రమైన వడగాల్పులు భయపెడుతున్నాయి. ఇప్పుడు అంతకంటే భయపెట్టే మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 28, 2024, 05:14 PM IST
Sunburn vs Cancer: ఎండల్లో ఎక్కువసేపుంటే కేన్సర్ రావచ్చా, నిజానిజాలేంటి

Sunburn vs Cancer: ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. భగభగమండే ఎండలతో జనం అల్లాడుతున్నారు. బయటకు వస్తే చర్మం కాలిపోతున్నట్టుగా ఉంటోంది. సన్‌బర్న్ సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అయితే ఇప్పుడిక ఈ సన్‌బర్న్ సమస్యను అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వచ్చింది. నిజంగా ఇది చాలా ప్రమాదకరమైందనే విషయం వెలుగుచూస్తోంది. 

ఎండాకాలంలో ప్రధానమైన సమస్య సన్‌బర్న్‌ను ఇక తేలిగ్గా తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల్లో ఎక్కువగా ఉంటే కేన్సర్ ముప్పు వెంటాడుతుందంటున్నారు. ఎవరైనా ఎక్కువ సేపు ఎండల్లో ఉంటే సూర్యుని కిరణాల ద్వారా ప్రసరించే అల్ట్రావయొలెట్ రేడియేషన్ కారణంగా చర్మం కణజాలంలో ఉండే డీఎన్ఏకు హాని కలుగుతుంది. దాంతో మ్యూటేషన్ జరగవచ్చు. ఇది కేన్సర్‌కు కారణం కావచ్చు. ఎండల్లో ఎక్కువ సమయం పనిచేసే రైతులు, కూలీలు కేన్సర్‌కు ఎక్కువగా గురవుతున్నారు. సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాలు వల్ల చర్మ కేన్సర్ ముప్పు పెరుగుతోంది. 

మెలినోమా అనేది ఓ రకమైన చర్మ కేన్సర్. ఎండల్లో ఎక్కువ సేపు అదే పనిగా ఉంటుంటే ఈ కేన్సర్ సోకే ప్రమాదముంది. ఈ కేన్సర్ చాలా ప్రమాదకరమైంది. సర్జరీ ఒక్కటే దీనికి చికిత్స. ఆ తరువాత కీమో థెరపీ, రేడియో ధెరపీ ఉంటుంది. ఎండల వల్ల ఉత్పన్నమయ్యే చర్మ కేన్సర్ రకాల్లో ఇది చాలా ప్రమాదకరమైంది. 

బేసల్ సెల్ కార్సినోమా. సూర్య కిరణాలతో తలెత్తే మరో రకమైన చర్మ కేన్సర్. ఈ కేన్సర్ ఎక్కువగా ముఖం, దిగువ పెదవి, ముక్కు, చెవి, భుజాలు, చేతులు వంటి ప్రదేశాల్లో వస్తుంది. దీనికి చికిత్స అందుబాటులో ఉంది. సర్జరీ, రేడియో ధెరపీ చికిత్స ద్వారా నియంత్రిస్తున్నారు. 

స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది మరో రకమైన చర్మ కేన్సర్. ఇది కూడా ఎక్కువ సేపు ఎండల్లో ఉండేవారికి, నిత్యం ఎండల్లో పనిచేసేవారికి వస్తుంది. ఎండలకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలకు ఈ కేన్సర్ సోకుతుంది. ముఖ్యంగా ముఖం, చెవులు, మెడ, చేతులపై రావచ్చు. అయితే ఈ కేన్సర్‌కు చికిత్స అందుబాటులో ఉంది. ముందు సర్జరీ తరువాత కండీషన్‌ను బట్టి కిమియో ధెరపీ లేదా రేడియో ధెరపీ ఉంటుంది. 

అయితే విటమిన్ డి కూడా సూర్య రశ్మి ద్వారానే శరీరానికి లభిస్తుంటుంది. అందుకే ఉదయం పూట కాస్సేపు ఎండలో ఉంటూ విటమిన్ డి పొందేందుకు ప్రయత్నించాలి. ఇక ఎండల్లో వెళ్లే పరిస్థితి ఉంటే తీక్షణమైన సూర్య కిరణాల్నించి శరీరాన్ని రక్షించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం చాలా మంచి పద్ధతి. అంతేకాకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించడం చేయాలి. 

Also read: Flat Foot Myths: ఫ్లాట్ ఫుట్ అంటే ఏమిటి, నిజంగా దీనివల్ల సమస్యలుంటాయా, నిజానిజాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News