Cholesterol Diet: హై కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. గుండె వ్యాధులకు దారి తీస్తుంది. ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు తింటే కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరంలో లో డెన్సిటీ లిపోప్రోటీన్ అధిక మోతాదులో ఉంటే గుండె పోటు ముప్పు పెరుగుతుంది. దీన్ని నియంత్రించాలంటే ఆహారపు అలవాట్లు మారాలి. డైట్ సరిగ్గా ఉండాలి. కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల పండ్లు తినడం ద్వారా కొలెస్ట్రాల్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అనారోగ్యకరమైన ఆహారం, ప్రోసెస్డ్ ఫుడ్స్, ఆయిలీ, ఫ్రైడ్ పదార్ధాలు, షుగర్ ఫుడ్స్ ,ఫైబర్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవడం ప్రధాన కారణాలు. దాంతోపాటు స్మోకింగ్, మద్యం సేవనం, ఎక్సర్‌సైజ్ లేకపోవడం, అధిక రక్తపోటు, డయాబెటిస్ కూడా ఇతర కారణాలుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కొన్ని రకాల పండ్లను డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి.


వాస్తవానికి పుల్లటి పండ్లలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి హానికారకమైన ఎల్‌డీఎల్‌ను తగ్గించేందుకు దోహదపడతాయి. అదే సమయంలో హెల్తీ కొలెస్ట్రాల్ పెంచుతాయి. విటమిన్ సి అనేది హార్ట్ డిసీజ్, బ్లడ్ ప్రెషర్ ముప్పును తగ్గిస్తాయి. 


అవకాడోలో మోనో శాచ్యురేటెడ్ , పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ రెండూ గుండెకు చాలా ప్రయోజనకరం. అవకాడో అనేది హై డెన్సిటీ లిపోప్రోటీన్, లోడెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. 


నేరేడు పండులో ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉపయోగపడతాయి. నేరేడుపండ్లను ఏదో రూపంలో డైట్‌లో భాగంగా చేసుకుంటే..శరీరంలో హెల్తీ కొలెస్ట్రాల్ పెంచుకోవచ్చు.


అరటిపండులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్‌తో పాటు సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది. అరటిపండు పొటాషియం, ఫైబర్‌లకు మంచి సోర్స్ ఫుడ్. ఫలితంగా కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.


కరిగే తత్వమున్న ఫైబర్ ఫుడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. పండ్లలో ఇటువంటి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లలో యాపిల్ కీలకమైంది. 


Also read; Heart Hole Symptoms: గుండెలో రంధ్రముంటే..ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok