Constipation Problem: ప్రస్తుతం జీవిత విధానంలో వివిధ రకాల అహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతోంది. జీర్ణక్రియ సరిగ్గా ఉండకపోవడంతో మలబద్ధకం వంటి తీవ్ర సమస్యలు బాధిస్తున్నాయి. రోజూ ఉదయం లేచిన వెంటనే ఇదే సమస్య పీడిస్తుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో తలెత్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం చెడు ఆహారం, చెడు జీవనశైలినే. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, మసాలా పదార్ధాలు, ఆయిల్ ఫుడ్స్ వంటివి ఎసిడిటీ, మల బద్ధకం, కడుపు నొప్పికి దారి తీస్తుంటాయి. ఈ సమస్యల్ని బయటపడేందుకు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు అలవర్చుకోవల్సి ఉంటుంది. రోజూ ఉదయం వేళ యోగా చేయడం వల్ల చాలా వరకూ సమస్యలు దూరమౌతాయి. జీర్ణక్రియ మెరుగుపడవచ్చు. 


సాధారణంగా జీర్ణవ్యవస్థ వృద్ధుల్లో బలహీనంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం చెడు ఆహారపు అలవాట్ల కారణంగా పిల్లల్లో కూడా అదే పరిస్థితి ఎదురౌతోంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మలబద్ధకం, తలనొప్పి, దద్దుర్లు, నోటి పుండ్లు వంటి చాలా సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం వేళ కొన్ని యోగాసనాలు వేయడం వల్ల జీర్ణక్రియను మెరుగుపర్చుకుని మలబపద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.


పవన్ముక్తాసనం మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కల్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. శరీరాన్ని అలసట నుంచి బయటపడేస్తుంది. దీనికోసం మంచంపై పడుకుని రెండు కాళ్లను కలిపి వంచాలి. మీ మోకాళ్లను మీ ఛాతీపైకి తీసుకురావాలి. పాదాల్ని రెండు చేతులతో పట్టుకోవాలి. ఇలా రోజూ కనీసం 8 సార్లు చేయాలి. 


రెండవ ముఖ్య ఆసనం భుజంగాసనం. ముందు నేలపై పొట్టపై పడుకోవాలి. ఇ్పపుడు మీ పాదాల్నిపూర్తిగా వంచి మీ అరచేతుల్ని భుజాలకు దగ్గరగా ఉంచి నేలపై ఆన్చి బలంగా పైకి లేవాలి. అంటే మీ వెనుకభాగం భూమిపైనే ఉంటుంది కానీ ముందు భాగం పైకి లేస్తుంది. ఈ ఆసనం రోజూ 7-8 సార్లు వేయాలి. 


మూడవది బాలాసనం. ఈ ఆసనం వేసేందుకు ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. ఆ తరువాత మీ రెండు చేతుల్ని పైకి లేపి ముందుకు వంచాలి. ఇప్పుడు మీ చేతుల్ని వెనక్కి మీ పాదాలకు సమాంతరంగా తీసుకెళ్లి నేలకు ఆన్చాలి. అదే సమయంలో మీరు ముందుకు వంగి తలను నేలకు ఆన్చాలి. ఈ ఆసనం వల్ల మలబద్ఖకం వంటి సమస్యలు దూరం కావడమే కాకుండా స్థూలకాయం సైతం తగ్గుతుంది. 


Also read: Sugar vs Honey: మధుమేహం వ్యాధిగ్రస్థులకు తేనె మంచిదా కాదా, తేనెతో బరువు తగ్గుతుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook