Diabetes Drinks: డయాబెటిస్ ఎంత సాధారణమో అంతే ప్రమాదకరం. ఒకసారి వచ్చిందంటే ఇక జీవితాంతం వదలదు. డయాబెటిస్ వ్యాధికి చికిత్స లేదు. కేవలం నియంత్రణ మాత్రమే సాధ్యం. అది కూడా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, జీవనశైలి సక్రమంగా చేసుకోవడం ద్వారా. అదెలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతున్న జీవనశైలి, వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇటీవలి కాలంలో మధుమేహం, రక్తపోటు ప్రధాన సమస్యలుగా మారడమే కాకుండా దాదాపు అందరిలో కన్పిస్తోంది. డయాబెటిస్‌కు అల్లోపతి వైద్య విధానంలో చాలా మందులున్నాయి. కానీ పూర్తి స్థాయిలో నిర్మూలన సాధ్యం కాదు. అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. అయితే కొన్ని హోమ్ డ్రింక్స్ ద్వారా మధుమేహం నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


మధుమేహం వ్యాధిగ్రస్థులకు బాదం పాలు అద్భుతంగా ఉపయోగపడుతుంది. బాదం పాలు అనేవి శరీరంలో చక్కెర శాతాన్ని పెంచదు. ఆవు పాలలో ఉన్నట్టే బాదం పాలలో కూడా కేలరీలు చాలా తక్కువ. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ల కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. సత్తు డ్రింక్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే బీటా గ్లూకోన్ వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. 


మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడే మరో డ్రింక్ కోకమ్ జ్యూస్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాల వల్ల చక్కెర శాతం అద్భుతంగా తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ రోగులకు చాలా బాగా దోహదపడుతుంది. ఇక అందరికీ తెలిసిన మరో డ్రింక్ గ్రీన్ యాపిల్ జ్యూస్. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు మధుమేహం ముప్పును తగ్గిస్తాయి.


ఇక మధుమేహం వ్యాధిగ్రస్థులకు అద్బుతంగా ఉపయోగపడే మరో జ్యూస్ జీడిపప్పు పాలు. జీడిపప్పులో ఉండే ఎనకార్డిక్ యాసిడ్ అనేది రక్తంలో చక్కెర శాతం నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులకు జీడిపప్పు పాలు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అద్భుతంగా తగ్గిస్తాయి.


Also read: Iron Deficiency: శరీరంలో ఐరన్ లోపముంటే ఈ ఐదు లక్షణాలుంటాయి జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook