Curry Leaves Juice for Weight Loss: ప్రతి భారతీయుడి కిచెన్ ఆయుర్వేదపరంగా ఓ ఖజానాగా చెప్పుకోవచ్చు. కిచెన్‌లో లభించే వివిధ రకాల వస్తువులు, పదార్ధాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందులో ఒకటి కరివేపాకు. వాడి పారేసే కరివేపాకుతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే ఇంకెప్పుడూ వదిలిపెట్టరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరివేపాకు ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభిస్తుంది. సాధారణంగా సాంబారు, పప్పు, పోహా, ఉప్మా ఇలా వివిధ రకాల వంటల్లో సువాసన, రుచి కోసం తాలింపులో కరివేపాకు ఉపయోగం తప్పనిసరిగా ఉంటుంది. అయితే చాలామంది తినేటప్పుడు కరివేపాకును పాడేస్తుంటారు. వాడి వదిలేసేవాడిని అందుకే కరివేపాకులా అని పోలుస్తుంటారు. కానీ  చాలామందికి కరివేపాకుతో కలికే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. తెలిస్తే ఇలా చేయరు. కరివేపాకులో కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ లాభాలేంటో తెలుసుకుందాం..


ఇమ్యూనిటీ పటిష్టం


శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే రోగ నిరోధక శక్తి పటిష్టంగా ఉండాలి. అప్పుడే ఏ విధమైన వ్యాధులు దరిచేరకుండా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కరివేపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటే రోజూ ఉదయం పరగడపున కరివేపాకు జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి.


Also Read: Maha Kedar Yoga 2023: 20 సంవత్సరాల తర్వాత మహాకేదార్ రాజయోగం.. ఈ రాశులవారు ఏం చేసిన డబ్బే..డబ్బు.. 


అధిక బరువుకు చెక్


ఒకవేళ మీరు స్థూలకాయంతో ఇబ్బంది పడుతుంటే తక్షణం బరువు తగ్గించుకోవల్సిందే. దీనికోసం కరివేపాకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల సులభంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో పేరుకున్న విష లేదా వ్యర్ధ పదార్ధాలను బయటకు తొలగిస్తుంది. కరివేపాకు జ్యూస్ బరువు తగ్గించుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడనుంది.


జీర్ణక్రియ మెరుగుదల


చాలామందికి కడుపు సంబంధిత లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయి. కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాల కారణంగా ఈ సమస్య తొలగిపోతుంది. కడుపు సంబంధిత వ్యాధుల్ని దూరం చేయడంలో కరివేపాకు కీలకంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలుంటే రోజూ కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కరివేపాకుతో కేశాలను కూడా సంరక్షించుకోవచ్చు. హెయిల్ ఫాల్ సమస్యను అరికట్టడంలో, జుట్టు నల్లబడేలా చేయడంలో కరివేపాకు అద్భుతంగా ఉపయోగపడుతుందంటారు. మజ్జిగలో కరివేపాకులు వేసుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.


Also Read: Memory Power Yoga: పిల్లల ఏకాగ్రత పెరగడానికి ప్రతిరోజు ఈ రెండు ఆసనాలు వేయించండి.. మెమరీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook