Diabetes Control Tips: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రమాదకరంగా మారుతున్న వ్యాధి డయాబెటిస్. మధుమేహానికి సరైన చికిత్స లేదు. కానీ నియంత్రణ మాత్రం సాధ్యమే. మధుమేహం నియంత్రించేందుకు ఆయుర్వేదంలో మాత్రం అద్బుతమైన పరిష్కారముందంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహానికి ప్రకృతిలో చాలా మంది ఔషధాలున్నాయి. అవేంటనేది తెలుసుకోగలిగితే కచ్చితంగా మధుమేహం వ్యాధికి చెక్ పెట్టవచ్చు. అలాంటిదే ఇది. ఓ చెట్టు ఆకులు నమిలి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పచటికీ నియంత్రణలో ఉంటాయంటారు. డయాబెటిస్ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. ఈ వ్యాధి ఎవరికి ఎప్పుడు వస్తుందనేది అంచనా వేయడం కష్టమే. జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకుంటేనే డయాబెటిస్ వ్యాధి వస్తుంది. సరైన డైట్, లైఫ్‌స్టైల్ ద్వారానే తిరిగి ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు.


మధుమేహం నియంత్రించేందుకు ప్రకృతిలో మంచి మంచి ప్రత్యామ్నాయ మందులున్నాయి. వీటిని తీసుకుంటే ఎలాంటి దుష్పరిణామాలుండవు. జామాకులు ఇందుకు అద్భుతమైన పరిష్కారంగా చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. రాత్రి పడుకునేముందు జామాకుల్ని నమిలి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఉదయం లేచేటప్పటికి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో వచ్చేస్తాయి. 


ఆయుర్వేద వైద్యుల ప్రకారం డయాబెటిస్ రోగులు జామాకులు ఎప్పుడైనా తినవచ్చు కానీ రాత్రి పూట తింటే మరింత మెరుగైన ఫలితాలుంటాయి. ఎందుకంటే్ రాత్రి వేళ జామాకులు పూర్తిగా శరీరంలో కరిగిపోగలవు. ఫలితంగా శరీరంలో పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో వచ్చేస్తాయి. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు రాత్రి పూట జామాకులు నమిలి తింటే మంచిదంటారు. 


జామాకుల్ని ఎలా నమిలి తినాలో కూడా పద్ధతులున్నాయి. చిన్న చిన్న లేత జామాకుల్ని ఎంచుకోవాలి. 3-4 ఆకుల్ని తెంచి నీళ్లలో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఒక్కొక్కటిగా ఆ ఆకుల్ని నమిలి తినాలి. బాగా నమిలి తిన్న తరువాత ఆకుల్లోంచి రసం వస్తుంది. ఆ రసాన్ని మింగేయాలి. పూర్తిగా నమిలిన తరువాత నోట్లో ఏమైనా మిగిలితే నీళ్లతో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలావరకూ అదుపులో ఉంటాయి.


Also read: Honey Purity Test: తేనె అసలైందో కాదో ఎలా తెలుసుకోవడం, టాప్ 4 చిట్కాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook