Whats is Metabolism: మెటబోలిజం అంటే కణజాలంలో లేదా ఆర్గానిజమ్‌లో జరిగే రసాయన మార్పులు. మనిషి మనుగడకు ఈ మార్పులు అత్యవసరం. తీసుకునే ఆహారాన్ని ఎనర్జీగా మార్చి శరీరమంతటికీ అందించే ప్రక్రియ ఇది. అందుకే ఈ ప్రక్రియలో ఏ మాత్రం లోపం ఏర్పడినా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బహుశా అందుకే వైద్యశాస్త్రంలో మెటబోలిజంకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శరీరం మెటబాలిజం సరిగ్గా ఉంటే ఏ విధమైన సమస్యలు రావనేది వైద్యశాస్త్రం పదే పదే చెబుతున్న మాట. సకల రోగాలకు అదే కారణం. మరి శరీరం మెటబాలిజం లేదా జీవక్రియను వేగవంతంగా మెరుగ్గా ఉండాలంటే కొన్ని సులభమైన పద్ధతులున్నాయి.


ఎందుకంటే నిత్య జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవన శైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ప్రతి సమస్యకు ఆసుపత్రుల చుట్టూ పరుగెట్టాల్సిన అవసరం లేదు. వంటింట్లో లభించే అద్భుతమైన ఔషధాలతోనే చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అదే విధంగా ప్రతి వంటింట్లో ఉండే వాముతో మెటబోలిజం వేగవంతమౌతుంది.  


వాము నీరు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని ఆయుర్వేద వైదులు చెబుతుంటారు. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో వాముకు ప్రత్యేక మహత్యముంది. వాము నీరు రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే..జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు బరువు తగ్గించుకునేందుకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని జీవక్రియను వాము నీరు మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఊబకాయం నియంత్రించవచ్చంటారు వైద్య నిపుణులు. 


Also Read: Tips For Bright Teeth: మెరిసే, శుభ్రమైన దంతాల కోసం ఇలా చేయండి


ఇక మహిళలకు సంబంధించి తరచూ పీరియడ్స్ సమయంలో భరించలేని కడుపు నొప్పి అనేది సాధారణంగా కన్పించే సమస్య. ఈ సమస్యతో బాధపడేవాళ్లు నీటిలో వామును బాగా మరగబెట్టి చల్లార్చి తీసుకోవాలి. ఫలితంగా కడుపు నొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. పీరియడ్స్‌కు ముందు నుంచే ఈ చిట్కా ప్రారంభిస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి. 


రోజూ ఉదయం పరగడుపున వాము నీరు తీసుకోవడం చాలా మంచిది. ఒక చెంచా వాము గింజల్ని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాల్సి ఉంటుంది. ఉదయం ఆ నీటీని మరిగించి..వడపోసి తాగాలి. ఇలా చేయడం ద్వారా..వివిధ రకాల ఆరోగ్య సమస్యల్నించి దూరం చేసుకోవచ్చు. దీనికి కారణం ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలెక్కువ. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, నికోటిన్ యాసిడ్, కార్పొహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌లు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. వామునీరు క్రమం తప్పకుండా తీసుకుంటే.. గొంతు నొప్పితో బాధపడేవాళ్ళు, నోటి నుంచి దుర్వాసన వెలువడేవారికి ఉపశమనం కలుగుతుంది. కడుపులో గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలకు కూడా వాము నమిలి తింటే అద్భుత ప్రయోజనాలున్నాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మెటబోలిజం దానంతటదే వేగవంతమౌతుంది.


Also Read: Asthma Care Tips: ఈ పండ్లు మీ రెగ్యులర్ డైట్‌లో ఉంటే ఆస్తమాకు పూర్తిగా చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి