Health Tips: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కు లంగ్స్‌తో సంబంధమేంటి, మంచిదా కాదా
Health Tips: శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంచేంచుదుకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. ఈ పోషకాల్లో అతి ముఖ్యమైంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఫిట్ అండ్ స్లిమ్ బాడీకు ఉపయోగపడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి తెలుసుకుందాం..
Health Tips: మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోషకాల్లో కీలకమైనవిగా ఫ్యాటీ యాసిడ్స్‌ను పేర్కొనవచ్చు. ఇందులో పోలీ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ గ్రూప్‌కు చెందింది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. శరీరం పనితీరుకు ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఓ అధ్యయనం ప్రకారం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఊపిరితిత్తులకు చాలా ప్రయోజనం కల్గిస్తాయి.
అసలు శరీరానికి ఇంతలా మేలు చేకూర్చే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వాస్తవానికి పోలీఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ గ్రూపుకు చెందినవి. శరీరానికి కావల్సిన శక్తిని అందించి పనితీరుకు దోహదం చేస్తాయి. ఇవి వాల్‌నట్స్, సోయాబీన్, గుడ్లు, కొన్ని రకాల చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల గుండె, రక్త నాళాలు, ఊపిరితిత్తులు అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం తినే ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేట్టు చూసుకుంటే ఊపిరితిత్తులకు చాలా మంచిది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆరోగ్యకరమైన ఆహారం ఊపిరితిత్తులకు చాలా చాలా మంచిది. వీటివల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శ్వాస ప్రక్రియ. సామర్ధ్యం పెరుగుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. ఎవరి రక్తంలోనైనా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయంటే ఆ వ్యక్తి ఊపిరితిత్తుుల పనితీరుపై సానుకూల ప్రభావం కన్పిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సీపీఓడీ సమస్యతో ఇబ్బంది పడేవారికి చాలా ప్రయోజనకరం. శరీరంలోని విష పదార్ధాలు ఊపిరితిత్తులతో కనెక్ట్ కావడం వల్ల ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్ ఏర్పడుతుంది.
సీపీఓడీ సమస్య ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఊపిరితిత్తుల్లో క్రమక్రమంగా మందగిస్తుంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం ప్రారంభిస్తే ఊపిరితిత్తుల పనితీరు క్రమంగా మెరుగుపడుతుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook