Exercise For Weight Loss: ఈ సింపుల్ టిప్స్‌తో బరువు తగ్గడమే కాకుండా మీ పొట్ట భాగం స్లిమ్ అవ్వడం ఖాయం..

Simple Exercises To Lose Weight At Home: బరువు తగ్గాలనుకునేవారు తరచుగా చేయకూడని పనులు చేస్తున్నారు ముఖ్యంగా చాలామంది ఆహారాలు తినడం మానుకుంటున్నారు. ఇలా చేయడం పెద్ద తప్పుని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా చాలామంది కఠిన తరమైన వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఇలా చేయకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించండి.
 


Weight Loss Exercise At Home: బరువు తగ్గడానికి చాలామంది ఆహారాలు తీసుకోవడం మానుకుంటున్నారు. అంతేకాకుండా కష్టపడి జిమ్ లో ఎక్కువసేపు గడుపుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ఇకనుంచి కష్టపడనక్కర్లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా మీ పొట్టను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

1 /5

ప్రస్తుతం చాలామంది బెల్లీ ఫ్యాట్ తో పాటు బరువు తగ్గించుకోవడానికి కఠిన తరమైన వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా చేయడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.  

2 /5

బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామాలు చేసే క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బరువు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఇది ఫాలో అవ్వాలి.

3 /5

శరీర బరువును సులభంగా నియంత్రించుకోవాలనుకునేవారు మొదటగా మీ రోజుని సూర్య నమస్కారాలతో ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

4 /5

శరీర బరువు తగ్గడానికి వ్యాయామాలు చేసే క్రమంలో తప్పకుండా గ్రీన్ టీ ని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

5 /5

వ్యాయామం చేసే క్రమంలో చాలామంది శరీరం డిహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది. కాబట్టి బరువు తగ్గే గ్రామంలో వ్యాయామాలు చేసిన తర్వాత తప్పకుండా నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ వ్యాధులు కూడా సులభంగా తగ్గుతాయి.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x