Detox Drink: మనిషి శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేస్తుండాలి. శరీరంలోని వ్యర్ధ లేదా విష పదార్ధాలను బయటకు తొలగించే ప్రక్రియనే డీటాక్సిఫికేషన్ అంటారు. శరీరంలో విష పదార్ధాలు పేరుకుపోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన విధానంలో ఎన్నో రకాల వ్యాధులు ఎదురౌతుంటాయి. రోజూ తినే చెడు ఆహార పదార్ధాలు, జీవన శైలి కారణంగా శరీరంలో భారీగా చెత్త చెదారం, వ్యర్ధ పదార్ధాలు పేరుకుపోతుంటాయి. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. చాలారకాల వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. ఈ విష పదార్ధాలను ఎప్పటికప్పుడు డీటాక్స్ చేస్తుండాలి. శరీరాన్ని డీటాక్స్ చేయాలంటే ఒకే ఒక్క జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ జ్యూస్ బత్తాయి జ్యూస్. బత్తాయిలో వివిధ రకాల పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఎ, ఫాస్పరస్ , పొటాషియం, కార్బోహైడ్రేట్స్ చాలా పెద్దసంఖ్యలో ఉంటాయి.


ఇందులో ఉండే పోషక పదార్ధాలు శరీరాన్ని అద్భుతంగా డీటాక్స్ చేస్తాయి. బత్తాయి రసం ఒంటికి చలవ చేయడమే కాకుండా శరీరంలోని వ్యర్ధాలను తొలగించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల ఇమ్యూనిటీ సైతం గణనీయంగా పెరుగుతుంది. బత్తాయిలో ఫ్లెవనాయిడ్స్ ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అజీర్తి, ప్రేవుల్లో వ్యర్ధాల సమస్య తొలగిపోతుంది. బత్తాయి రసం రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కేన్సర్ వంటి వ్యాధుల్ని కూడా దూరం చేయవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంహగా ఉండటం వల్ల అల్సర్ వంటి వ్యాధులు తలెత్తవు.


బత్తాయి రసం రోజూ తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవడమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో పెద్దమొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ సి కారణంగా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తవు. 


Also read: Heart Attack Signs: గుండెపోటు వచ్చేముందు శరీరం పంపించే ఈ సంకేతాలతో జాగ్రత్త



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook