Papaya Seeds: బొప్పాయి గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటివారైనా నిస్సంకోచంగా తినగలిగే ఫ్రూట్ ఇది. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బొప్పాయితో పాటు బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయని చాలామందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బొప్పాయి అనేది విరివిగా లభించే ఫ్రూట్ మాత్రమే కాదు తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. అందుకే బొప్పాయి అందరూ తినగలిగే అద్భుతమైన ఫ్రూట్. బొప్పాయితో కలిగే ప్రయోజనాలు కూడా అత్యధికం. చాలామంది బొప్పాయి గింజల్ని మాత్రం పడేస్తుంటారు. కానీ బొప్పాయి గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవల్సిందే. ప్రముఖ న్యూట్రిషియనిస్టులు చెప్పేదాని ప్రకారం బొప్పాయి గింజలతో చాలా లాభాలున్నాయి. వీటిని స్టోర్ చేసుకుని సేవించవచ్చు.


బరువు నియంత్రణలో..


సాధారణంగా బొప్పాయి పండ్లను డైట్ కంట్రోల్‌లో భాగంగా తీసుకుంటారు. అయితే బొప్పాయి గింజలు బరువు నియంత్రణలో అద్భుతంగా దోహదపడతాయి. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా స్థూలకాయం దరిచేరదు. బరువు పెరగకుండా అదుపులో ఉంటుంది.


జలుబు-దగ్గు నుంచి రక్షణ


బొప్పాయి గింజల్లో పోలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దాంతో అంటువ్యాధుల ముప్పు తగ్గుతకుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు.


కొలెస్ట్రాల్ నియంత్రణ


బొప్పాయి గింజల్లో ఫ్యాటీ యాసిడ్స్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదం చేస్తాయి. ధమనుల్లో ప్లక్ తగ్గితే సహజంగానే రక్తపోటు తగ్గుతుంది. దాంతో గుండెపోటు, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ వంటి గుండె సంబంధిత వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు.


బొప్పాయి గింజలు ఎలా తీసుకోవాలి


బొప్పాయి గింజలతో బొప్పాయిని మించిన ప్రయోజనాలున్నాయి. అయితే ఈ విత్తనాలను ఎలా తీనాలి, ఏదైనా విధాముందా అనేది తెలుసుకుందాం. బొప్పాయి కోసిన తరువాత అందులోని గింజల్ని వేరు చేసి నీళ్లు శుభ్రం చేయాలి. ఆ తరువాత ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండిన బొప్పాయి గింజల్ని పౌడర్‌గా చేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడీ పౌడర్‌ను రోజూ పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో కలిపి సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. లేదా స్వీట్స్, జ్యూస్ వంటి ఇతర పదార్ధాల్లో కలిపి కూడా సేవించవచ్చు. బొప్పాయి గింజల పౌడర్ రుచి కాస్త చేదుగా ఉంటుంది. 


Also read: Raw Onion Benefits: పచ్చి ఉల్లిపాయతో అధిక రక్తపోటు, డయాబెటీస్‌కు ఇలా 9 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook