Health Benefits of Pudina Leaves: వేసవిలో సాధారణంగా శరీరానికి చలవ చేసే పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని అంతర్గతంగ చల్లబరిచే పదార్ధాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ముఖ్యమైంది పుదీనా. పుదీనా అనేది రుచిని పెంచడమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య గుణాలు కలిగి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుదీనా ఆకుల ఉపయోగం వేసవిలో ఆరోగ్యపరంగా మంచిది. చాలా రకాల వ్యాధుల్ని దూరం చేస్తాయి. ఎందుకంటే పుదీనాలో విటమిన్ సి, ప్రోటీన్లు, మెంథాల్, విటమిన్ ఎ, కాపర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. వేసవిలో గ్యాస్, వికారం వంటి సమస్యలు దరిచేరవు. పుదీనా ఆకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఈ తరహా సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.


జీర్ణక్రియ మెరుగుపర్చేందుకు


వేసవిలో సాధారణంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. కడుపు సంబంధిత ఇబ్బందులు ఏర్పడతాయి. పుదీనా ఆకులతో ఈ సమస్యల్నించి తక్షణం ఉపశమనం పొందవచ్చు. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అజీర్తి సమస్యల్నించి ఉపశమనం కల్గించేందుకు అద్భుతంగా దోహదపడతాయి. పుదీనా నీళ్లతో కూడా ఈ ప్రయోజనాలు పొందవచ్చు.


Also Read: Chia Seeds Side Effects: అతిగా చియా సీడ్స్‌ వినియోగిస్తున్నారా? అయితే ఇది గుర్తుంచుకోండి!


బరువు తగ్గించుకునేందుకు


స్థూలకాయం బాధితులకు పుదీనా అద్భుతమైన చికిత్సలా పనిచేస్తుంది. పుదీనా ఆకులతో బరువు వేగంగా తగ్గించుకోవచ్చు. పుదీనా ఆకులను ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు గానీ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. పుదీనా ఆకులతో చట్నీ, పుదీనా నీళ్లు, పుదీనా టీ రూపంలో సేవిచంవచ్చు. దీనిల్ల బరువు వేగంగా తగ్గించుకోవచ్చు. ఇందులో కొద్దిగా నిమ్మరసం, నల్ల మిరియాల పౌడర్ కలుపుకోవచ్చు. 


తలనొప్పి నుంచి ఉపశమనం


పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఫలితంగా తరచూ తలనొప్పి సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. చాలామందికి వేసవిలో తీవ్రమైన తలనొప్పి సమస్య వెంటాడుతుంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు తాజా పుదీనా ఆకులు అద్భుతంగా అరోమోథెరపీలా పనిచేస్తాయి. పుదీనా ఆకుల సువాసనే సగం నొప్పిని తగ్గించేస్తుంది. పుదీనా ఆయిల్ లేదా పుదీనా బామ్ తో మాలిష్ చేయవచ్చు.


Also Read: Liver Detox: రోజు ఈ గింజలను తింటే ఎంత మద్యం సేవించినా.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook