Garlic Benefits: రోజూ పరగడుపున కాల్చిన వెల్లుల్లి తింటే కేన్సర్, డయాబెటిస్ , బీపీ అన్నీ మాయం
Garlic Benefits: ప్రకృతిలో లభించే అన్ని పదార్ధాల్లో అద్భుతమైన పోషక విలువలుంటాయి. ఏ పదార్ధంలో ఏమున్నాయో తెలుసుకుని తినగలిగితే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు అవసరం. పూర్తి వివరాలు మీ కోసం.
Garlic Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో చాలావరకూ ప్రతి కిచెన్‌లో లభ్మమౌతుంటాయి. కిచెన్‌లో వివిధ రకాల వంటల్లో ఉపయోగించే పదార్ధాలతో వంటలకు రుచి రావడమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనం కలుగుతుంది.
భారతీయుల ప్రతి వంటలో తప్పకుండా ఉపయోగించే పదార్ధాల్లో అతి ముఖ్యమైంది వెల్లుల్లి. వెల్లుల్లిని ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఔషధంగా పరిగణిస్తారు. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే పోషకాలు అంత ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిలో పొటాషియం, ఫాస్పరస్, సల్ఫర్, సెలేనియం, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, సోడియం విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్‌తో పాటు పోలీఫెనోల్స్, ఫ్లెవనాయిడ్స్, ఫ్లెవనోల్స్, టానిన్స్, పోలీ శాకరైడ్స్ ఎలిసిన్, ఇలా చెప్పుకుంటూ జాబితా చాంతాడంత ఉంటుంది. అన్నీ శరీరానికి ఉపయోగమైన పోషకాలే. అందుకే వెల్లుల్లిని కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యపరంగా చాలా రకాల సమస్యలు దూరం చేసేందుకు ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడమే కాకుండా రక్తపోటు, బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో ఉంచుతాయి. వెల్లుల్లిని ప్రతిరోజూ పరగడుపున కొద్దిగా కాల్చుకుని కూడా తినవచ్చు. వెల్లుల్లి పచ్చిగా తినలేనివారు మంటపై పైపైన కాల్చుకుని తినవచ్చు.
వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వెల్లుల్లి కొద్దిగా కాల్చుకుని తినడం వల్ల లేదా పచ్చి వెల్లుల్లి తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ఉండే ఎలిసిన్ అనే కాంపౌండ్ వల్ల గుండెకు మేలు చేకూరుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదం చేస్తుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.
రోజూ పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల ఇందులో ఉండే సల్ఫర్ కణాల కారణంగా శరీరంలో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు అవసరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇక లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వెల్లుల్లి రెమ్మలు రోజుకు 3-4 తినాల్సిందే. వెల్లుల్లి రెమ్మలు రోజూ 3-4 తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు వెల్లుల్లి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.
ఇక అన్నింటికంటే ప్రదానంగా వెల్లుల్లి రోజూ తినడం వల్ల కేన్సర్ కణాలపై పోరాడే శక్తి లభిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కేన్సర్ చికిత్సలో వెల్లుల్లి ఉపయోగం మంచి ఫలితాలనిచ్చిందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
Also read: Ragi Laddu Recipe: రాగి లడ్డు ఎలా తయారు చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook