Immunity Foods: శీతాకాలం వచ్చిందంటే చాలు జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం చలికాలంలో మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే. రోగ నిరోధక శక్తి తగ్గిందంటే చాలు సీజనల్, వైరల్ వ్యాధులు వెంటాడుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీజన్ మారిన ప్రతిసారీ శరీరంలో జరిగే మార్పుల కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వీటిలో జలుబు, జ్వరం, దగ్గు వంటివి చాలా సాధారణం. ఈ సమస్యల్నించి కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవల్సిన అవసరం ఉంది. అందుకే హెల్తీ ఫుడ్స్ తినమని వైద్యులు పదే పదే సూచిస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలో ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే సగం వ్యాధులకు కారణం ఇమ్యూనిటీ లోపించడమే.


ఇమ్యూనిటీని పెంచే పదార్ధాల్లో అద్భుతమైంది పాలకూర. ఇందులో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ పెద్దఎత్తున ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, ఫోలేట్ కారణంగా శరీరాన్ని రోగాల్నించి తట్టుకునే సామర్ధ్యం, కొత్త కణాల నిర్మాణం జరుగుతుంది. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్‌లు ఉండటం వల్ల పాత అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. 


ఇక డ్రైఫ్రూట్స్ కూడా ఇమ్యూనిటీని వేగంగా పెంచుతాయి. ఇందులో ముఖ్యమైంది బాదం. ఇందులో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పిలిచే విటమిన్ ఇ ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీని శరవేగంగా పెంచగలదు. అందుకే ప్రతిరోజూ కొన్ని నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 


ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో కావల్సినంత విటమిన్ సి అందుతుంది. విటమిన్ సి అంటేనే సూపర్ వపర్ యాంటీ ఆక్సిడెంట్. వివిధ రకాల వ్యాధులతో పోరాడే సామర్ధ్యం కలుగుతుంది. వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంలో దోహదపడుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ ని మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే విటమిన్ సికు లోటుండదు. ఫలితంగా చాలా రకాల సీజనల్ వ్యాధుల్నించి రక్షణ లభిస్తుంది. 


వెల్లుల్లికి ఆయుర్వేదపరంగా చాలా ప్రాశస్త్యం ఉంది. సాధారణంగా వెల్లుల్లిని వంటల రుచి మెరుగుపర్చేందుకు వినియోగిస్తారు. అదే సమయంలో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా వ్యాధుల్నించి రక్షించేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే ఎలిసిన్ అనే కాంపౌండ్ రోగ నిరోధక గుణాల్ని కలిగి ఉంటుంది. వెల్లుల్లిని ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు. రోజూ పరగడుపున తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.


ఇక మరో పదార్ధం పెరుగు. ప్రో బయోటిక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉంటే లైవ్ బ్యాక్టీరియా కడుపుని హెల్తీగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రో బయోటిక్స్ హెల్తీ గట్ బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి.


Also read: Cardamom health benefits: యాలకలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎన్నో సమస్యలకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook