Winter Diet Tips: శీతాకాలంలో చలి గాలుల కారణంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు తలెత్తుతుంటాయి. గొంతులో గరగర పీడిస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గడమే. అందుకే ఇమ్యూనిటీ పటిష్టం చేసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఇమ్యూనిటీ తగ్గడమే. అందుకే ఇమ్యూనిటీని బలోపేతం చేసే ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. ఇమ్యూనిటీ బలంగా 
ఉంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆకు కూరలు ఎక్కువగా తినాలి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులతో పోరాడే శక్తిని కల్గిస్తాయి. అదే విధంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమౌతాయి. ఆందుకే ఈ ఆకుకూరలు డైట్‌లో ఉండే ఎలాంటి సమస్యలు తలెత్తవు.


ఆవాల సాగు పంజాబ్‌లో చాలా ఎక్కువ. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కారణంగా ఫ్రీ రాడికల్స్ నాశనమౌతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దక్షిణాదిన విరివిగా ఉపయోగించే కరివేపాకు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. ఫలితంగా చలికాలంలో ఎదురయ్యే చాలా సమస్యలు దూరమౌతాయి. చలికాలంలో శ్వాస సంబంధ సమస్యలు కూడా తలెత్తవు. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. 


ధనియాలు లేదా కొత్తిమీరలో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. ఫలితంగా డైట్‌లో చేర్చడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు దూరం చేస్తుంది. కొత్తిమీరను కూరల్లో, చట్నీగా లేదా సలాడ్‌తో తీసుకోవచ్చు. చలికాలంలో విరివిగా లభించే మరో ఆకు కూర పాలకూర. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కే, ఐరన్, కాల్షియం సమృద్దిగా ఉంటాయి. ఈ ఆకు కూర తినడం వల్ల ఇమ్యూనిటీ బలోపేతమౌతుంది. వివిధ రకాల వ్యాదుల్నించి శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో ఆక్సిడేటివ్ స్ట్రెస్ దూరం చేయవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా గంభీరమైన వ్యాధులు దూరమౌతాయి. పాలకూరలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభమౌతుంది. 


మెంతి కూర మరో అద్బుతమైన పోషకాహారం. ఇందులో లిక్విఫైడ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియలో దోహదం చేస్తాయి. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతాయి. నొప్పులు దూరమౌతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. 


Also read: Athimadhuram Powder Benefits: శీతాకాలంలో అతిమధురం చూర్ణాన్ని ఎందుకు తీసుకోవాలో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook