Athimadhuram Powder Benefits: మన పూర్వీకులు అన్ని వ్యాధులకు ఆయుర్వేదనే వినియోగించేవారు చిన్న నొప్పుల నుంచి మొదలుకొని దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఆయుర్వేద శాస్త్రంలో అన్ని మూలకాలను పేర్కొన్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇప్పటికీ ఆయుర్వేద చిట్కాలనే వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయుర్వేదానికి అంత ప్రాముఖ్యత లభించింది. ఆయుర్వేదం ప్రకారం ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మూలికను వినియోగించాల్సి ఉంటుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద మూలికల్లో ఒకటైన అతి మధురం చూర్ణాన్ని తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో గొప్ప ఔషధ గుణాలు లభిస్తాయి కాబట్టి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి దీంతోపాటు శరీరానికి కొన్ని లాభాలు కూడా కలుగుతాయి..అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అతిమధురం చూర్ణాన్ని వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ప్రస్తుతం ఈ చూర్ణం అన్ని ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా లభిస్తోంది. అయితే చాలామంది శీతాకాలం వచ్చిందంటే గొంతు నొప్పి ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారికి అతి మధుర చూర్ణం ప్రభావంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగించి ఇన్ఫెక్షన్లను శరీరం నుంచి దూరం చేసేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా చాలామందిలో చలికాలంలో చర్మ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలకు కూడా ఈ చూర్ణం ఎంతో సహాయపడుతుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
అతిమధురం చూర్ణాన్ని టీలా తయారుచేసి తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. ఈ టీ ని రోజుకు రెండు నుంచి మూడుసార్లు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శీతాకాలంలో వచ్చే రోగ నిరోధక సమస్యలు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ టీ ప్రభావవంతంగా సహాయపడుతుంది. శాశ్వతంగా శరీర బరువును నియంత్రించుకోవాలనుకునేవారు ఉదయం పూట తప్పకుండా అతిమధురంతో తయారుచేసిన టీ ని తీసుకోవాలి.
అతిమధురంతో తయారు చేసిన టీని ప్రతిరోజు తాగడం వల్ల నోట్లో నుంచి వచ్చే దుర్వాసన, దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మొటిమల సమస్యలతో పాటు చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు అతిమధురం చూర్ణాన్ని తేనెలో కలుపుకొని చర్మానికి పట్టించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వయస్సు పెరగడం కారణంగా వచ్చే చర్మ సమస్యలు సులభంగా దూరమవుతాయి. కాబట్టి తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అతి మధురం చూర్ణంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ను వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి