Health Drinks: ఈ ఐదు డ్రింక్స్ సేవిస్తే కేవలం నెలరోజుల్లో కొలెస్ట్రాల్‌కు చెక్, ట్రై చేయండి
Health Drinks: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, కిడ్నీ, గుండె పోటు వ్యాధులు ఇందులో ప్రమాదకరమైనవి. ఈ సమస్యకు పరిష్కారమార్గాలేంటో తెలుసుకుందాం..
Health Drinks: ఇటీవలి కాలంలో బిజీ లైఫ్ కారణంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి పెరిగిపోతోంది. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్‌కు అలవాటు పడిపోతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా ఎదురయ్యే వివిధ రకాల వ్యాధులకు మూలం కొలెస్ట్రాల్. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తపోటు సమస్య తలెత్తుతుంది. క్రమంగా ఇది గుండెపోటు, కిడ్నీ వ్యాధులు, మధుమేహం వ్యాధికి కారణమౌతుంది. అందుకే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు. కొలెస్ట్రాల్ నిర్మూలించేందుకు కొన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఐదు రకాల డ్రింక్స్ సేవిస్తే కేవలం నెలరోజుల వ్యవధిలోనే కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు.
కొలెస్ట్రాల్ సమస్య వల్లే గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్య తలెత్తతుంది. దీనినే ఇస్కీమిక్ గుంండె వ్యాధులుగా పరిగణిస్తారు. ఈ సమస్యకు కారణంగా కొలెస్ట్రాల్ మాత్రమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొలెస్ట్రాల్‌లో ఉండే ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్‌లో ఎల్‌డీఎల్ ప్రమాదకరం. చెడు కొలెస్ట్రాల్ ఇది. అందుకే శరీరంలో ఎల్‌డీఎల్ లేకుండా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది పూర్తిగా డైట్‌ని బట్టి ఉంటుంది. కొలెస్ట్రాల్ పెంచే ఆహార పదార్ధాలకు సాధ్యమైనంతవరకూ దూరంగా ఉండాలి.
గ్రీన్ టీ ఇందులో అతి ముఖ్యమైంది. గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎల్‌డీఎల్‌ను వేగంగా తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే కాటెబిన్స్, ఎపిగాల్లోకాటెబిన్ వంటి పదార్ధాలు గ్రీన్ టీలో కావల్సినంతగా ఉంటాయి. అయితే రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ సముచితం. అంతకుమించి తాగడం మంచిది కాకపోవచ్చు.
ఇక రెండవ డ్రింక్ బెర్రీ స్మూతీ. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో కేలరీలు, కొవ్వు చాలా తక్కువ. అదే సమయంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బెర్రీ స్మూతీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. వారానికి కనీసం 4 సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది.
టొమాటో రసం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. టొమాటో జ్యూస్ తయారు చేసినప్పుడు ఇందులో లైకోపీన్ అనే కంటెంట్ పెరుగుతుంది. ఇది శరీరంలో అడ్డతిడ్డంగా పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను శరవేగంగా తగ్గిస్తుంది. ఇక మరో ముఖ్యమైన డ్రింక్ సోయా మిల్క్. సోయా మిల్క్ తాగడం వల్ల కొవ్వు, కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతుంది.
వివిధ వైద్య శాస్త్ర అధ్యయనాల ప్రకారం కోకో డ్రింక్ మంచి ప్రత్యామ్నాయం. కోకో ఫ్లేవనోల్స్‌ను రోజుకు రెండుసార్లు నెలరోజులు తీసుకుంటే ఎల్‌డీఎల్ చాలా వేగంగా తగ్గుతుంది. అదే సమయంలో చాక్లెట్ పానీయాల్లో షుగర్, సాల్ట్ పరిణామం తగ్గించేయాలి. లేకపోతే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ డ్రింక్స్ క్రమం తప్పకుండా తీసుకుంటూనే రోజూ లైట్ వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయి.
Also read: Health Tips: మునగాకుల్లో అద్భుత ఔషధ గుణాలు, తెలిస్తే వదిలిపెట్టరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook