Health Tips: మునగాకుల్లో అద్భుత ఔషధ గుణాలు, తెలిస్తే వదిలిపెట్టరిక

Health Tips: ప్రకృతిలో కన్పించే వివిధ రకాల మొక్కలు, చెట్లలో అద్భుతమైన పోషక పదార్ధాలుంటాయి. సరైన రీతిలో వినియోగిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ముఖ్యమైంది మునగ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 16, 2023, 04:03 PM IST
Health Tips: మునగాకుల్లో అద్భుత ఔషధ గుణాలు, తెలిస్తే వదిలిపెట్టరిక

Health Tips: ఆయుర్వేద శాస్త్రంలో మునగకు చాలా ప్రాధాన్యత ఉంది. మునగకాయలతో పాటు మునగాకుల్లో కూడా లెక్కకు మించిన ఔషధ గుణాలున్నాయి. ఇవి తెలుసుకుంటే ఇక ఎప్పుడూ మునగాకు కానీ, మునగ కాయలు కానీ వదలరు మీరు. 

దక్షిణాదిలో మునగచెట్టు చాలా విరివిగా కన్పిస్తుంది. మునగకాయల కూర చాలా రుచిగా ఉంటుంది. కేవలం రుచి ఒక్కటే కాదు ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. అయితే చాలామందికి మునగాకుల గురించి తెలియదు. వాస్తవం ఏంటంటే మునగాకుల్లో అద్భుతమైన పోషకాలున్నాయి. అందుకే మునగాకుల్ని ఆయుర్వేదం ప్రకారం సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. మునగాకుల్లో విటమిన్లు, కాల్షియం, ఐరన్, అమైనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. మునగాకుల్ని, మునగ పూవుల్ని ఔషధంగా ఉపయోగించడం అనాదిగా వస్తున్నదే.

మునగాకులు మధుమేహం, మంట, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్‌పెక్షన్లు, కీళ్ల నొప్పి, గుండె వ్యాధులు, కొలెస్ట్రాల్ , ఆర్ధరైటిస్, అధిక రక్తపోటు, లివర్ సమస్య, కడుపులో అల్సర్, ఆస్తమా, కేన్సర్, డయేరియా నియంత్రించడంలో దోహదపడతాయి. మునగాకుల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ అవడం వల్ల డైట్‌లో భాగంగా చేసుకుంటే శారీరక బలహీనత తగ్గుతుంది. మునగాకులు డైట్‌లో భాగంగా చేసుకుని రోజూ లేదా వారానికి 3-4 సార్లు తింటే కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా చర్మ సంబంధిత సమస్యల్నించి ఉపశమనం కలుగుతుంది. 

ఇక మునగాకుల్లో పుష్కలంగా లభించే విటమిన్ సి కారణంగా రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. మునగాకుల్ని సేవించడం వల్ల జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుందంటారు. ఫలితంగా మలబద్ధకం, కడుపులో యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య తగ్గుతుంది. మునగాకుల్లో ఉండే క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగుతాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల ముప్పు పూర్తిగా తగ్గుతుంది. 

Also read: Running Tips: శీతాకాలంలో రన్నింగ్‌ చేసేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News