Healthy Liver: లివర్ సదా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 పదార్ధాలు డైట్‌లో ఉంటే చాలు
Healthy Liver: మనిషి శరీరంలోని అతి ముఖ్యమైన, కీలకమైన అంగాల్లో ఒకటి లివర్. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి సంబంధించి చాలా విధుల నిర్వహణలో లివర్ పాత్ర అత్యంత కీలకం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Healthy Liver: శరీరంలో గుండె, కిడ్నీలు ఎంతటి ముఖ్యమైన అంగాల్లో లివర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. లివర్ పనితీరులో ఏదైనా సమస్య తలెత్తితే మొత్తం శరీరంపై ఆ ప్రభావం పడుతుంది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని వస్తువులు తప్పకుండా డైట్‌లో భాగంగా చేసుకోవాలి.
మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. ఎప్పటికప్పుడు లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే శరీరం మెటబోలిజంను వేగవంతం చేసేది లివర్ మాత్రమే. లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ఏ పనీ చేయకూడదు. అంటే లివర్ ఆరోగ్యాన్ని అంత జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. లేకపోతే లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్ధాలు సేవించాల్సి ఉంటుంది. లివర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
నువ్వులు
లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో నువ్వులు తప్పకుండా ఉండాలి. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్ ఇ, ఇతర పోషకాలు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా లివర్‌ను క్లీన్‌గా ఉంచడంలో ఉపయోగపడతాయి. ఫలితంగా లివర్ పనితీరు మెరుగుపడుతుంది.
కీరా
కీరా అనేది లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కీరా రోజూ తినడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే నీటి శాతం కారణంగా శరీరంలోని విష పదార్ధాలు చాలా సులభంగా బయటకు పోతాయి. కీరా అనేది లివర్‌ను శుభ్రపరుస్తుంది.
వెల్లులి
వెల్లుల్లిని ఆయుర్వేదం ప్రకారం అద్భుతమైన ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే ఎలిసిన్ అనే కాంపౌండ్ కారణంగా లివర్ శుభ్రంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అత్యధికంగా ఉంటాయి. ఇది లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాలిఫ్లవర్
కాలిఫ్లవర్ సైతం లివర్ ఆరోగ్యానికి అద్భుతమైన పరిష్కారం కాగలదు. ఎందుకంటే లివర్‌ను శుభ్రపర్చడంతో కాలిఫ్లవర్ దోహదం చేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్ ఉంటాయి. లివర్ దెబ్బతినే అవకాశాలు పూర్తిగా తగ్గుతాయి.
పుచ్చకాయ
పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్,లైకోపీన్‌లు లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. లివర్‌లో ఏదైనా సమస్య తలెత్తితే పుచ్చకాయ తినడం వల్ల అది దూరమౌతుంది. బెస్ట్ డీటాక్స్ డ్రింక్‌గా కూడా పుచ్చకాయ ఉపయోగపడుతుంది.
Also read: Turmeric Benefits: పసుపుతో ఈ 5 పదార్ధాలు కలిపి తీసుకుంటే..కొలెస్ట్రాల్, కేన్సర్ సహా 25 వ్యాధులు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook