Diabetes Tips: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురయ్యే వివిధ రకాల వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. ఈ వ్యాధికి చికిత్స లేకపోయినా నియంత్రణ మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి అనేవి మధుమేహంపై కీలక ప్రభావం చూపుతాయి. మధుమేహం నియంత్రించకపోతే క్రమంగా ప్రాణాంతకం కాగలదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం అనేది కేవలం చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా తలెత్తుతుంది. అందుకే మధుమేహాన్ని లైఫ్‌స్టైల్ డిసీజ్‌గా పిలుస్తుంటారు. అందుకే డైట్‌లో తగిన మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఐదు రకాల కూరగాయలు క్రమం తప్పకుండా డైట్‌లో ఉండాల్సిందేనంటున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర శాతం గణనీయంగా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ నుంచి తక్షణం ఉపశమనం లభిస్తుంది.


పాలకూర మధుమేహం వ్యాధిగ్రస్థులకు అద్భుతమైన ఔషధంగా భావిస్తారు. ఇందులో ఫైబర్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చుకుంది. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది.


మధుమేహం వ్యాధిగ్రస్థులకు అద్భుతమైన ప్రయోజనాలు కల్గించే మరో కూరగాయ టొమాటో. వివిధ రకాల కూరల్లో, వంటల్లో తప్పకుండా వాడుతుంటారు. ఇందులో ఉండే లైకోపిన్ అనే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. టొమాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉండి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. టొమాటోలు గుండె ఆరోగ్యానికి కూడా మంచివి. 


బెండకాయలతో రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గించవచ్చు. ఇందులో ఉండే శాలిసాకరైడ్లు, ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. కేవలం మధుమేహానికే కాకుండా ఇతర వ్యాధులను కూడా తగ్గిస్తుంది. 


ఇక బ్రోకలీ, కాలిఫ్లవర్ అనేవి డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరం. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఐసోథియోసైనేట్ అనేది రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.


గుమ్మడికాయ అనేది మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఓ వరం లాంటిది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించగలదు. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడానికి పోలీ శాకరైడ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.


Also read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook