Vitamin D Benefits: విటమిన్ డి సూర్య రశ్మిలోనే కాదు..ఈ 4 పదార్ధాలు తీసుకుంటే చాలు
Vitamin D Benefits: శరీరానికి విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. అన్నీ సక్రమంగా ఉంటేనే మనిషి ఎదుగుదల ఉంటుంది. ఈ విటమిన్లలో కీలకమైంది విటమిన్ డి. శరీరంలో చాలా విధాలుగా ఉపయోగపడే అత్యవసరమైన విటమిన్ ఇది.
Vitamin D Benefits: మనిషి శరీర నిర్మాణం, ఆరోగ్యంలో పోషక పదార్దాల పాత్ర కీలకం. విటమిన్లు, మినరల్స్ రూపంలో ఉండే పోషకాలు లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది విటమిన్ డి.
విటమిన్ డి పేరు వినగానే సూర్య రశ్మి గుర్తొస్తుంది. ప్రకృతి ద్వారా పుష్కలంగా లభించే విటమిన్ ఇది. శరీరంలో కాల్షియం, ఫాస్పరస్ జీర్ణానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎముకల నిర్మాణం, బలోపేతం చేయడంలో విటమిన్ డి పాత్ర కీలకం. విటమిన్ డి అనేది ఫ్యాట్ కరిగించేందుకు దోహదపడుతుంది. పళ్ల ఆరోగ్యానికి కూడా విటమిన్ డి ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు ఇమ్యూనిటీ పెంచేందుకు, మెదడు, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపర్చేందుకు సహాయం చేస్తుంది. చర్మానికి సూర్య రశ్మి తగిలినప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అదే సమయంలో చేపలు, గుడ్డులో పసుపు భాగం, పాలు, తృణ ధాన్యాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ డి శరీరంలోని కాల్షియం, ఫాస్పరస్‌లను జీర్ణం చేసేందుకు దోహదపడుతుంది. స్వెల్లింగ్ తగ్గించేందుకు కణాల అభివృద్దికి, రోగ నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ డి పాత్ర కీలకమైంది. విటమిన్ డి లోపిస్తే ఆస్టియోపోరోసిస్, డయాబెటిస్, గుండె వ్యాధులు, కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల ముప్పుకు కారణమౌతుంది. ప్రకృతిలో సూర్య రశ్మి ద్వారా సహజసిద్ధంగా లభించే విటమిన్ డిను ఆహార పదార్ధాల ద్వారా కూడా పొందవచ్చు.
గుడ్లు పసుపు భాగం
గుడ్లలోని పసుపు భాగంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. రోజువారీ విటమిన్ డి అవసరాల్లో 6 శాతం కేవలం ఒక గుడ్డు ద్వారానే లభిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
మష్రూం
మష్రూం లేదా పుట్ట గొడుగుల్లో కూడా విటమిన్ డి అత్యధికంగా దొరుకుతుంది. సూర్య రశ్మిలోని అల్ట్రైవైలెట్ కిరణాల ప్రభావంతో పుట్ట గొడుగుల్లో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.
ఫ్యాటీ ఫిష్
సాల్మన్, ట్యూనా, మైకేరల్ వంటి ఫ్యాటీ చేపల్లో విటమిన్ డి కావల్సినంత లభిస్తుంది. వండిన 3 ఔన్సుల సాల్మన్ చేపలో దాదాపు 450 ఐడీయూ పరిమాణంలో విటమిన్ డి ఉంటుంది.
ఫోర్టిఫైడ్ ఫుడ్
పాలు, ఆరెంజ్ జ్యూస్, దానిమ్మలో విటమిన్ డి తగిన పరిమాణంలో ఉంటుంది. అయితే ఇందులో విటమిన్ డి ఫోర్టిఫైడ్ అయుంటుంది.
Also read: Honey Water For Weight Loss: ఈ వార్మ్ వాటర్‌తో 15 రోజుల్లో 2కిలో బరువు తగ్గడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook