Watermelon: ఇటీవలికాలలో ప్రపంచవ్యాప్తంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అందుకే మధుమేహం వస్తే ముందుగా నియంత్రించాల్సింది డైట్ మాత్రమే. ఏది తినవచ్చు, ఏది తినకూడదనేది చాలా జాగ్రత్తగా చెక్ చేస్తుండాలి. అయితే కొన్ని ఆహార పదార్ధాల విషయంలో ఇప్పటికీ చాలామందికి సందేహాలున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం ఉంటే తీపి పదార్ధాలు అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనివల్లబ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే కొన్ని రకాల పండ్లు కూడా తినకూడదని వైద్యులు సూచిస్తుంటారు. పండ్లలో ఉండే నేచురల్ షుగర్ ఫ్రక్టోజ్ మదుమేహాన్ని పెంచుతుంది. అయితే వేసవిలో మార్కెట్‌లో విరివిగా కన్పించే పుచ్చకాయ విషయంలో కూడా చాలామందిలో సందేహం నెలకొని ఉంటుంది. పుచ్చకాయ తినవచ్చా లేదా అనేది. ఇది తెలుసుకునేముందు డయాబెటిస్ ప్రయోజనాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.


యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అందించిన నివేదిక ప్రకారం ఒక కప్పు లేదా 152 గ్రాముల పుచ్చకాయలో 9.42 గ్రాముల నేచురల్ షుగర్ ఉంటుంది. 11.5 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది. పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది సాధారణంగా 72 ఉంటుంది. కానీ ప్రతి 120 గ్రాముల పుచ్చకాయలో గ్లైసెమిక్స ఇండెక్స్ 5  ఉంటుంది. అందుకే నియమితంగా పుచ్చకాయ తీసుకోవచ్చు. పుచ్చకాయ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా లేదా అనేది ఎంత తింటున్నామనేదానిని బట్టి ఉంటుంది. నియమిత మోతాదులో తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. 


మధుమేహం రోగుల్లో సాధారణంగా కార్డియో వాస్క్యులర్ వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. పుచ్చకాయను రోజూ తగిన మోతాదులో తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. పుచ్చకాయను ఎర్రగా ఉంచడంలో దోహదపడే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కార్డియో వాస్క్యులర్ వ్యాధి ముప్పును తగ్గిస్తుంది. 


Also read: Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు ప్రాణాంతకమౌతుంది, ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook