Arthiritis Home Remedies: గౌట్ అనేది ఎప్పట్నించో ఉన్న అనారోగ్య స్థితి. ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ఆర్థరైటిస్ కారణంగా కీళ్లు, జాయింట్ పెయిన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్థరైటిస్ దూరం చేసేందుకు చాలా పద్ధతులున్నాయి. పసుపు సహాయంతో ఆర్థరైటిస్ నయం చేయవచ్చు. పసుపు అనేది కేవలం వంట రుచి పెంచడానికే కాకుండా..వివిధ రకాల మందుల్లో వినియోగిస్తారు. పసుపు అనేది అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. పసుపుతో మెరుగైన ఆరోగ్యం కలుగుతుంది. రోజువారీ డైట్‌లో పసుపు చేర్చితే..కీళ్లు, జాయింట్ నొప్పులు తగ్గించుకోవచ్చు. పసుపులో కర్‌క్యూమిన్ ఉంటుంది. ఇదొక కెమికల్ కాంపౌండ్. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చాలాకాలంగా  కొన్ని అనారోగ్య సమస్యలకు పసుపును ఔషధంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఆర్ధరైటిస్ వంటి గంభీర వ్యాధుల్ని పసుపు సహాయంతో ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..


ఆర్ధరైటిస్ లక్షణాలు


నొప్పులు
గట్టిదనం
స్వెల్లింగ్
ఎర్రగా ఉండటం
నడవలేకపోవడం


ఆర్ధరైటిస్ లక్షణాల్ని తగ్గించడంలో పసుపులో ఉండే కర్‌క్యూమిన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కర్‌క్యూమిన్ అనేది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కర్‌క్యూమిన్ ఒక గ్రీన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 


పసుపు ఎలా తీసుకోవాలి


పసుపును వివిద రకాల వంటల్లో మసాలా రూపంలో తీసుకోవచ్చు
ఉదయం లేచిన వెంటనే పసుపు టీ తాగవచ్చు
సప్లిమెంట్‌గా ఉపయోగకరం
నిద్రపోయే ముందు రాత్రి పాలలో కలుపుకుని తాగడం
రోజూ ఉదయం పరగడుపున చిన్న పసుపు కొమ్మును బెల్లంతో కలిపి తినడం


Also read: Garlic Benfits: రోజుకో వెల్లుల్లి రెమ్మ తింటే చాలు..ఈ సీరియస్ వ్యాధులు మటుమాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook