Vitamin C Foods: వేసవి రాగానే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు, బాడీని హైడ్రేట్‌గా ఉంచేందుకు చాలామంది నిమ్మకాయ ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఇమ్యూనిటీ పెంచడంతో నిమ్మకాయను మించింది మరేదీ లేదు. అదే సమయంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు దోహదపడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మరసం సేవించడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరానికి కావల్సిన తక్షణ ఎనర్జీ లభిస్తుంది. విటమిన్ సి కొరత తీరుతుంది. కారణం నిమ్మలో విటమిన్ సి చాలా ఎక్కువ మోతాదులో ఉండటమే. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వేసవిలో విటమిన్ సి కొరతను దూరం చేసేందుకు తీసుకోవల్సిన కొన్ని పదార్ధాల గురించి తెలుసుకుందాం.


విటమిన్ సి కొరతను దూరం చేసే పదార్ధాలు


మిరపకాయ


మిరపకాయల్ని ఎక్కువగా ఆహారం తయారీలో ఉపయోగిస్తారు. పచ్చి మిరప, ఎండు మిరప లేదా మిరియాలలో పోషక గుణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చిమిర్చిలో కావల్సినంత విటమిన సి ఉంటుంది. మీరు మీ శీరరంలో విటమిన్ సి కొరతను దూరం చేయాలంటే మిరపకాయల్ని డైట్‌లో భాగంగా చేసుకోండి.


జాంకాయ


పండ్లలో జాంకాయ రుచి విభిన్నంగా, అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది ఇష్టంగా తింటారు. అయితే కడుపు సంబంధిత వ్యాధుల్ని ఎదుర్కోవడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. జాంకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. జాంకాయలు తరచూ తినడం వల్ల విటమిన్ సి కొరత తీరడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.


దోసకాయ


వేసవికాలంలో మార్కెట్‌లో దోసకాయలు చాలా ఎక్కువగా లభిస్తుంటాయి. డీహైడ్రేషన్ సమస్యను దూరం చేసేందుకు దోసకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దోసకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ. అందుకే రోజూ దోసకాయ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి.


Also read: Joint Pain Relief In 1 Day: కీళ్ల నొప్పులు తగ్గడానికి ఈ ఒక్క జ్యూస్‌ చాలు, కీళ్ల వాపులకు కూడా చెక్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook