Constipation Problem: ఇటీవలి కాలంలో జీర్ణ సంబంధ సమస్యలు పెరిగిపోతున్నాయి. రోజూ ఉదయం లేచిన వెంటనే మలబద్ధకం ప్రధాన సమస్యగా మారుతుంటోంది. కడుపు శుభ్రం కాకపోవడం వల్ల దైనందిక కార్యక్రమాలు ఇబ్బందిగా మారుతుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో ఎదుర్కొనే అన్ని సమస్యలకు కారణం జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు లేకపోవడమే. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు ఎదురై మలబద్ధకం పెను సమస్యగా మారుతుంటుంది. రోజూవారీ కార్యక్రమాలకు ఆటంకం ఎదురౌై అన్ని పనులకు విఘాతం కలుగుతుంది. మల బద్ధకం సమస్య నుంచి విముక్తి పొందాలంటే ముందు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. 


నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి చలవ చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే విష పదార్ధాలకను తొలగిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలుండేవాళ్లు రోజూ పరగడుపున గ్లాసు నిమ్మకాయ నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. తేనె కొద్దిగా కలుపుకుని కూడా తాగవచ్చు.


ఇక మరోవైపు ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాలు డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ రోజుకు 30-35 గ్రాములు ఉంటే మల బద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి.


త్రిఫలాన్ని ఆయుర్వేదశాస్త్రంలో ఔషధాల ఖజానాగా పిలుస్తారు. త్రిఫలం చూర్ణం అంటే ఉసిరి, బహేడా, హరడ్ కలిపి చేస్తారు. రాత్రి నిద్రించేముందు ముందుగా గ్లాసు వేడి నీటిలో త్రిఫలం గుళిక కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ఉదయం కడుపు పూర్తిగా శుభ్రమౌతుంది. 


పెరుగు శరీరాన్ని చలవ కల్గిస్తుంది. కడుపు శుభ్రం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మల బద్ధకం సమస్యను కూకటివేళ్లతో తొలగిస్తుంది. అయితే ప్రతి రోజూ డైట్‌లో పెరుగు తప్పకుండా ఉండాలి. పాల ఉత్పత్తి అయినందున ఇందులో ఉండే ప్రో బయోటిక్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో మలబద్ధకం సమస్య తలెత్తదు. 


Also read: Winter Risks: చలికాలంలో గుండె పోటు సమస్య పెరగడానికి కారణం ఇదే, ఈ టిప్స్ పాటించండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook