Lungs Health Foods: లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 7 రకాల ఫుడ్స్ తింటే చాలు
Lungs Health Foods: శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యం. ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. ఇందులో అతి ముఖ్యమైంది ఊపిరితిత్తుల ఆరోగ్యం.
Lungs Health Foods: ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో, అవి ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో కరోనా సమయంలో అందరికీ అవగాహన వచ్చి ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతినడానికి కేవలం వైరల్ ఇన్‌ఫెక్షన్లే కాదు కాలుష్యం, చెడు అలవాట్లు కూడా ప్రధాన కారణం. ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే కాకుండా కొన్ని ఆహార పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవాలి.
కాలుష్యం అనేది వాతావరణంతో సంబంధం లేకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటుంది. ఈ క్రమంలో శ్వాస అనేది అత్యంత ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. ఎందుకంటే శ్వాస ద్వారానే విష పదార్ధాలు శరీరంలోకి చేరుతాయి. మనకు తెలియకుండా చాలా చెత్త పదార్ధాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటాయి. అందుకే ఆస్తమా, లంగ్స్ కేన్సర్, టీబీ వంటి రోగాలు పెరుగుతున్నాయి. లంగ్స్ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కొన్ని ఆహార పదార్ధాలను తప్పకుండా తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. కాలుష్య ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
వెల్లుల్లి అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిది. వివిధ రకాల వ్యాధుల్నించి ఊపిరితిత్తుల్ని కాపాడుతుంది. రోజూ ఉదయం వేళ 1-2 వెల్లుల్లి రెమ్మలు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఇక ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చే మరో పదార్ధం మిర్చి. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా లభించడం వల్ల అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం వాల్ నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లంగ్స్ స్వెల్లింగ్ ఇతర సమస్యల్ని దూరం చేస్తాయి. శ్వాస తీసుకునే సామర్ధ్యాన్ని పెంచుతాయి. ఇక మరో పదార్ధం అల్లం. ఊపిరితిత్తుల పనితీరును అల్లం మెరుగుపరుస్తుంది. స్వెల్లింగ్ వంటి సమస్యలుంటే తొలగిస్తుంది.
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పసుపు అద్బుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు స్వెల్లింగ్, ఇతర సమస్యల్ని దూరం చేస్తాయి. ఇందులో ఉండే కర్‌క్యూమిన్ ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచుతుంది. జొన్నలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ఊపిరితిత్తులు సురక్షితంగా ఉంటాయి. పాలకూర, తోటకూర, అరటి వంటి ఆకుకూరల్లో కెరోటినాయిడ్స్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు పెద్దమొత్తంలో ఉంటాయి.
Also read: Glass Symbol Issue: ఇప్పుడు గుర్తు మార్చేందుకు వీలు కాదు, స్పష్టం చేసిన ఈ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook