Protein Deficiency: ఆరోగ్యానికి ప్రోటీన్లు, విటమిన్లు చాలా అవసరం. ప్రోటీన్ల లోపముంటే తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. ప్రోటీన్ల లోపంతో ఎదురయ్యే వ్యాధులు, ఆ వ్యాధి లక్షణాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు ప్రోటీన్లు చాలా అవసరం. శరీరంలో ప్రోటీన్ల లోపం కారణంగా గంభీరమైన వ్యాధులు పొంచి ఉంటాయి. మాంసకృతుల వృద్ధి, ఆరోగ్యమైన చర్మం, హార్మోన్ సమతుల్యత కోసం ప్రోటీన్లు అవసరమైన మోతాదులో ఉండాల్సిందే. ప్రోటీన్లు తక్కువైతే..అలసట, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ప్రోటీన్ల లోపంతో ఎటువంటి వ్యాధులు తలెత్తుతాయి, ఆ వ్యాధుల లక్షణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రోటీన్లకు ఆరోగ్యానికి చాలా సంబంధముంది. ప్రోటీన్లు కావల్సినంత ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేకపోతే శరీరంలోని ఎముకలు బలహీనమౌతాయి. ఫలితంగా చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవడం జరుగుతుంటుంది. ప్రోటీన్ల లోపంతో లివర్ సమస్యలు తలెత్తుతాయి. ప్రోటీన్లు తగ్గినప్పుడు లివర్‌లో ఫ్యాట్ చేరుకుంటుంది. ఇది ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలముంటే..లివర్ డ్యామేజ్ అవుతుంది. ప్రోటీన్ లోపంతో క్వాషియోర్కర్ అనే వ్యాధి వస్తుంది. ఇది సహజంగా చిన్నారుల్లో ఎక్కువగా వస్తుంది. 


ప్రోటీన్ లోపం లక్షణాలు


శరీరంలో ప్రోటీన్ లోపముంటే వేగంగా బరువు తగ్గిపోతారు. జుట్టు రాలిపోతుంటుంది. మజిల్స్‌లో నొప్పులుంటాయి. గోర్లు విరిగిపోతుంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బాడీ పెయిన్స్, స్వెల్లింగ్ ఉంటుంది. ఓవరాల్‌గా ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అలసట, విసుగు ఎక్కువౌతాయి. చర్మ సమస్యలు ఎదురౌతాయి. 


ఈ లక్షణాలు కన్పిస్తే మీలో ప్రోటీన్ లోపమున్నట్టే అర్ధం చేసుకోవాలి. అదే సమయంలో ప్రోటీన్ లోపాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో ప్రోటీన్ లోపంతో ఎదురయ్యే వ్యాధుల్ని రక్షించుకునేందుకు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. 


Also read: Natural Beauty Tips: మేకప్ లేని.. సహజసిద్ధమైన అందం కోసం ఈ టిప్స్ ఫాలో చేయండి చాలు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook